నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Bus Sccdientఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ-11 మంది మృతి

నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది .ఆర్టీసీ బస్సును,లారీ ఢీకొట్టడంతో 11 మంది స్పాట్ లో నే చనిపోయారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం ప్రకటించారు.

 

51444223120_295x200

నార్కెట్ పల్లి ఆర్టీసీ డిపోకు చెందిన ఎక్స్ ప్రెస్ బస్సు మధ్యాహ్నం భువనగిరి నుంచి నల్గొండకు బయల్దేరింది. రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం దగ్గర ఉన్న మూల మలుపు దగ్గరకు రాగానే…ఎదురుగా పుస్తకాల లోడుతో వస్తున్న లారీ ఢీకొట్టింది. రెండు వాహనాలు స్పీడుతో ఉండడంతో బస్సు డ్రైవర్ సహా స్పాట్ లోనే 11 మంది చనిపోయారు. మరో 17మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం బస్సులో 33 మంది ప్రయాణిస్తున్నారు. స్వల్ప గాయాలైన వారికి రామన్న పేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు అధికారులు. మరోవైపు సీరియస్ గా ఉన్న వారిని హైదరాబాద్ కామినేనికి తరలించారు. ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది

51444216402_625x300ఇన్సిడెంట్ పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం…వెంటనే ముగ్గురు మంత్రులను ఘటన స్థలానికి పంపించారు. హోంమంత్రి నాయిని..జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు..ట్రాన్స్ పోర్టు మినిస్టర్ మహేందర్ రెడ్డి…ఘటన స్థలాన్ని పరిశీలించారు..మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన మంత్రులు…మృతుల కుటుంబాలకు 2లక్షల పరిహారం ప్రకటించారు.  జిల్లా నేతలు కూడా ఘటన స్థలానికి చేరుకొని..క్షతగాత్రులను పరామర్శిస్తున్నారు. ఇంతమంది దుర్మరణం పాలవడంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

NLG ACCIDENT PHOTOS

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy