నల్గొండ రైతులు మీసం మెలేసే రోజులు తెస్తా: కేసీఆర్

cm-suryapetచైతన్యంలో సూర్యాపేట ఎప్పుడు ముందుంటుందన్నారు సీఎం కేసీఆర్. సూర్యాపేటను జిల్లా చేస్తానని అప్పుడే చెప్పానన్న సీఎం.. నాగార్జున సాగర్ కట్టాల్సిన చోట కట్టలేదని.. ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును వేరే చోట కట్టారన్నారు. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన సీఎం.. ప్రభుత్వ జూనియర్ కాలేజి గ్రౌండ్ లో నిర్వహించిన ప్రగతిసభలో మాట్లాడారు. నాగార్జున సాగర్ విషయంలో అప్పటి కాంగ్రెస్ నాయకులు మనల్ని మోసం చేశారన్నారు. ఏలేశ్వరం దగ్గర సాగర్ నిర్మాణం జరిగి ఉంటే 10లక్షల ఎకరాలు సాగులోకి వచ్చేవన్నారు. నీటి కేటాయింపుల్లో కూడా అన్యాయం జరిగిందన్నారు.

రెండేళ్లలో యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తి..

యాదాద్రి పవర్ ప్లాంట్  రెండేళ్లలో పూర్తి అవుతుందని…4వేల మెగావాట్లతో ఈ పవర్ ప్లాంట్  దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్ అవుతుందన్నారు సీఎం. పులిచింతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడి లాఠీ దెబ్బలు తిన్నామన్నారు. పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం కూడా తక్కువే ఇచ్చారన్నారు. ఖమ్మం, నల్గొండలో వేలాది ఎకరాలను ముంచి పులిచింతలను కట్టారన్నారు. పోతిరెడ్డిపాడుకు అక్రమంగా నీటిని తరలించుకుపోతుంటే కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

లక్ష మంది ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అడ్డుకున్నా కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తీరుతామని స్పష్టం చేశారు సీఎం. కాళేశ్వరం పూర్తయితే తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడకు నీళ్లొస్తాయన్నారు. త్వరలోనే నల్లగొండ రైతులు 3 లక్షల 20 వేల ఎకరాల్లో మీసం మెలేసి రెండు పంటలు పండిస్తారన్నారు.

మూసీకాల్వల ఆధునీకరణకు టెండర్లు…

కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ది చేస్తానన్నారు సీఎం కేసీఆర్. మూసీకాల్వల ఆధునీకరణకు వెంటనే టెండర్లు పిలుస్తామన్నారు. ఆరు నెలల్లో మూసీ కాల్వ ఆధునీకరణ పూర్తి కావాలన్నారు. సూర్యాపేట పుల్లారెడ్డి చెరువును బాగు చేస్తామన్నారు. వచ్చే ఏడాది బడ్జెట్లో పాత నల్లగొండ జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తామన్నారు. నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు కట్టించే బాధ్యత తనదేనన్నారు. సూర్యాపేట అభివృద్దికి రూ.75కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy