నల్లగొండ….కోమటిరెడ్డి అడ్డా !

సాయుధ పోరాటం కాలం నుండి తెలంగాణ ఉద్యమం వరకు నల్లగొండజిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ నల్లగొండ నియోజకర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. దశాబ్దాల పాటు కమ్యూనిస్ట్ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం గత రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ కు పట్టం కడుతోంది. ఈ సెగ్మెంట్ ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదేళ్ళకు పైగా ఏలుతున్నారు. నల్గొండ సెగ్మెంట్ లో పరిస్థితిపై స్పెషల్ స్టోరీ.

  • విభిన్న రాజకీయాలకు మారుపేరు నల్గొండ నియోజకవర్గం.
  • న్యాయం చేయగలరని నమ్మిన అభ్యర్థికే ఓటేయడం ఈ నియోజకవర్గ ఓటర్ల స్పెషాలిటీ.
  • 1994 వరకు కమ్యూనిస్టులదే నల్లగొండ నియోజకవర్గం.
  • కానీ 1999 నుంచి వరుసగా కాంగ్రెస్ అభ్యర్థే గెలుస్తూ ఉన్నారు.
  • నల్లగొండ సెగ్మెంట్ లో నల్లగొండ టౌన్ తో పాటు మరో 3 మండలాలు, 63 గ్రామపంచాయతీలున్నాయి.
  • ఈ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2 లక్షల  16వేల 475.
  • లక్షా 9 వేల 116 మంది పురుష ఓటర్లు, లక్షా 7 వేల 358 మంది మహిళా ఓటర్లుఉన్నారు.
  • 2009 ఎన్నికలకు ముందు 7 మండలాలతో ఉన్న నల్లగొండ నియోజకవర్గం…. పున:వ్యవస్థీకరణలో నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మండలాలతో కలిపి నల్లగొండ నియోజక వర్గంగా ఏర్పడింది.
    ……………………
  • 1994 వరకు కమ్యూనిస్టు పార్టీ నుండి నంద్యాల నర్సింహారెడ్డికి అవకాశం ఇచ్చారు.
  • కమ్యూనిస్టుల వల్ల అభివృద్ది సాధ్యం కాదనుకున్న ఓటర్లు 1999లో కాంగ్రెస్ పార్టీకి పట్టంగట్టారు.
  • అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు. అప్పట్నించి ఈ సెగ్మెంట్ లో ఆయనదే హవా.
  • వరుసగా మూడుసార్లు గెలిచిన కోమటిరెడ్డి మరోసారి 2014 ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.
  • మంత్రి పదవికి రాజీనామా చేయడం కోమటిరెడ్డికి ప్లస్ అయింది. మూడు ఎన్నికల్లో వరుసగా గెలుస్తున్న కోమటిరెడ్డికి నియోజకవర్గంలోని ప్రతీ ఓటరుతో సత్సంబంధాలుండటం కలిసొచ్చే అంశం.
  • పైగా ఆయనకు పోటీనిచ్చేందుకు సరైన అభ్యర్థి లేకపోవడం ప్లస్  పాయింట్.
  • గత ఎన్నికల్లో మహాకూటమి నుంచి కోమటిరెడ్డికి గట్టిపోటీ ఎదురైంది. అయినా 4 వేల మెజారిటీతో గట్టెక్కారు.
  • వైఎస్ హయాంలో జిల్లాలో చక్రం తిప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. జిల్లా రాజకీయాలపై పట్టు ఉండడంతో 2009 ఎన్నికలతో తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి భువనగిరి ఎంపీగా గెలిపించారు.
  • నకిరేకల్ సీటును తన అనుచరుడు చిరుమర్తి లింగయ్యకు ఇప్పించి గెలిపించుకున్నారు.
  • మొన్నటి పంచాయితీ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ లను గెలిపంచుకోవడం ఆయనకు బూస్ట్ ఇచ్చింది.
  • ఎన్నికలలో వాగ్దానాలను తీర్చడంలో కోమటిరెడ్డి  కొంతవరకు సక్సెస్ అయ్యాడంటున్నారు ఓటర్లు.
    ……………………
  • బలమైన నాయకుడిగా ఉన్నా కోమటిరెడ్డికి కొన్ని అంశాలు నెగిటివ్ గా మారాయి.
  • ప్రత్యర్థుల నుంచి పెద్దగా పోటీ లేకపోయినా… సొంతపార్టీలోనే శత్రువర్గం ఉండటం మైనస్.
  • జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి గ్రూప్ తో మరో వర్గం తలపడుతోంది.
  • ఆయన ఓటమికి సొంత పార్టీ నేతలే ప్రయత్నిస్తారన్నది సెగ్మెంట్ లో వినిపిస్తున్న మాట.
  • 15 ఏళ్లలో కోమటిరెడ్డి చేసిన అభివృద్ది ఏంటని మిగతా పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
  • పట్టణ అభివృద్ది కోసం 48 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పూర్తిస్థాయిలో పనులు చేయలేదని ఆ నిధుల్లో చాలావరకు కోమటిరెడ్డి అనుచరులే స్వాహా చేశారన్న విమర్శలున్నాయి.
  • 120 కి.మీ మేర వేసిన సీసీ రోడ్లలో 40 కి.మీ మేర శిథిలావస్థకు చేరడం సాక్ష్యంగా చూపిస్తున్నారు.
  • సాగునీరు , తాగునీరు అందిస్తామన్న ఇచ్చిన హామీని కోమటిరెడ్డి నిలబెట్టుకోలేదన్న విమర్శ ఉంది.
  • ఇక కోమటిరెడ్డికి పోటీగా టీఆర్ఎస్ నుంచి నర్సింహారెడ్డి, బీజెపీ నుంచి కె.శ్రీనివాసరెడ్డి నిల్చున్నారు.

………………

పదిహేనేళ్లుగా నల్గొండను ఏలుతున్న కోమటిరెడ్డికి ఈసారి అనుకూలించే అంశాలెన్ని ఉన్నాయో… ప్రతికూలాంశాలు అన్నే ఉన్నాయి. బలమైన ప్రత్యర్థి లేకపోవడం.. సెంటిమెంట్ అస్త్రంతో బరిలోకి దిగుతుండటంతో ఆయనకే అవకాశాలుండొచ్చన్నది పరిశీలకుల మాట.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy