నల్లధనం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలి: కేసీఆర్

kcrనోట్ల రద్దును స్వాగతిస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. నల్లధనాన్ని నిర్మూలించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. అంతేకాదు వజ్రాలు, బంగారం, విదేశీ కరెన్సీ, మలేషియా, సింగపూర్ లాంటి దేశాల నుంచి మనీలాండరింగ్ రూపంలో దేశంలోకి ప్రవేశిస్తున్న నల్లధనాన్ని కూడా పూర్తిగా నిర్మూలించాలని తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి కోరుతున్నట్లు చెప్పారు కేసీఆర్.

… ప్రజలు ఎదుర్కొంటున్న సాధక బాధలను కేంద్రంతో చర్చిస్తున్నాం. సమస్యలను ప్రధానికి వివరించాను. చేపట్టాల్సిన చర్యలను సూచించాను.

… 5 వేల కోట్ల చిన్న నోట్లను పంపాల్సిందిగా కేంద్రానికి లేఖ రాశాం. డబ్బు పంపుతామని డిసెంబర్ 15న RBI నుంచి లేఖ వచ్చింది.

… ఆసరా ఫించన్ల పంపిణీలో ఎదురవుతున్న సమస్యలను కేంద్రానికి వివరించాం. ఆర్థిక మంత్రి ఈటల కూడా కేంద్రంతో మాట్లాడారు. కేంద్రం పరిగణలోకి తీసుకుంది.

… రాష్ట్రంలోని బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యింది రూ. 54వేల 479 కోట్లు. ఇప్పటి వరకు రూ.19వేల 109 కోట్ల రూపాయలు RBI నుంచి రాష్ట్రానికి వచ్చాయి.

… మహిళలకు, వృద్ధులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాల్సిందిగా కోరాం.

… నగదు రహిత లావాదేవీలు జరపడంలో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ప్రయోగాత్మకంగా సిద్ధిపేటను నగదురహిత నియోజకవర్గంగా రూపొందిస్తున్నాం. ఇప్పటికే ఇబ్రహీంపూర్ ఆ గౌరవాన్ని పొందింది.

…. టీఎస్ వ్యాలెట్ ను ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకురాబోతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy