నల్లమల కాలిబాటలన్నీ మల్లన్న వైపే

sivaశివరాత్రికి ముందే నల్లమలలో భక్తుల సందడి మొదలైంది. శివనామస్మరణతో  కొండలు మార్మోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు నడుచుకుంటూ శ్రీశైలానికి చేరుకుంటున్నారు. 41 రోజులు నియమనిష్టలతో శివమాల ధరించిన స్వాములు.. మల్లన్న సన్నిధిలో మాల విరమణకు వస్తున్నారు.

నల్లమల అడవుల నుంచి శ్రీశైల మల్లన్న దర్శనానికి తరలి వెళ్లే శివస్వాముల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి శివస్వాములు శీశ్రైలం చేరుకుంటున్నారు. రోజుకు కనీసం 30 నుంచి 50 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న స్వాములు… రాత్రికి అంతా ఒకే దగ్గర బస చేసి… తిరిగి ఉదయం నడక ప్రారంభిస్తున్నారు.

కౄర జంతువులు, విష సర్పాలకు నిలయమైన నల్లమలలో… స్వాములకు ఇంత వరకు ఏ చిన్న ప్రమాదం కూడా జరగలేదంటున్నారు. అచ్చంపేట, ఉమామహేశ్వరం, మన్ననూరు, ఫరహాబాద్, అప్పాపూర్, సంగిడి గుండాల , పాతాళగంగ మార్గంలో ఉన్న దట్టమైన అడవిలో కూడా శివస్వాములు కాలినడకన వెళ్లేవారు. అయితే 2007 లో కొందరు దారితప్పడంతో ఈ మార్గంలో స్వాములను అనుమతించడం లేదు.

స్వాములు వెళ్లే దారిలో కొందరు భక్తులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన్ననూరు, ఫరహాబాద్, వటవర్లపల్లి, దోమలపెంట, ఈగలపెంట, పాతాళ గంగ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అన్నదానం, పలహారాల పంపిణీ, మందులు, మంచి నీటిని ఉచితంగా అందిస్తున్నారు. స్వాములు విశ్రాంతి తీసుకోవటానికి , పూజలు చేసుకోవటానికి, వంటలు వండుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అధికారులు కూడా వైద్య సౌకర్యలు అందుబాటులో ఉంచారు. ట్యాంకర్ల ద్వారా దారిపొడవునా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.

కాలినడకన శ్రీశైలం చేరుకుని.. శివసన్నిధిలో గడిపితే అనుకున్న కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. అందుకే ఏటా శివస్వాముల సంఖ్య క్రమంగా పెరుగుతోందంటున్నారు స్థానికులు. ప్రభుత్వం కూడా స్వాములకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy