నల్లమలలో శివనామస్మరణ హోరు

Srisailam-piligrimageశ్రీశైలానికి భక్తులు పోటెత్తుతున్నారు. మహాశివరాత్రి రోజున మల్లికార్జునస్వామి సన్నిధిలో గడపడానికి తరలివస్తున్న భక్తులతో శ్రీశైలగిరులు కిటకిటలాడుతున్నాయి. శివమాలలు ధరించి 40 రోజుల దీక్ష చేసిన భక్తులు శివనామస్మరణతో పాదయాత్ర చేస్తూ మహాక్షేత్రానికి చేరుకుంటున్నారు.

శివరాత్రి సమీపించడంతో వేలాది మంది భక్తులు నల్లమల అడవుల్లో పాదయాత్రగా వస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏమాత్రం లెక్కచేయకుండా ఓం నమః శివాయ నామస్మరణతో ముందుకు సాగుతున్నారు.

దట్టమైన అడవుల్లో వెలసిన కోనేరు పక్కన శివభక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల కోసం.. చాలా చోట్ల సోలార్ లైట్లు, తాగునీరు ఏర్పాట్లు చేశారు. మరోవైపు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కూడా భక్తుల వెంట పాదయాత్రగా వెళుతూ…..  విశ్రాంతి కేంద్రాల దగ్గర వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.

అడవిలో వెళ్లే వారు కాలినడకన శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వెలసిన కొన్ని పురాతన దేవాలయాలు.. ఇతర విశ్రాంతి సత్రాల వద్ద విడిది చేస్తుంటే.. కొండలు ఎక్కలేని వారి కోసం చెంచులు చేతి కర్రలు తయారు చేసి  అమ్మి ఉపాధి పొందుతున్నారు.

చిమ్మచీకటి భయపెడుతున్నా భక్తులు శివయ్యనే నమ్ముకుని ముందుకు సాగుతున్నారు.  దాతలు భక్తులకు కొండంత అండగా నిలుస్తున్నారు. కాలినడకన వెళ్లే దారిలో 24 గంటలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అడవిలో కాలినడకన వెళ్లే శివభక్తులకు దాతలు అన్నదానం, వైద్య సిబ్బంది నిరంతరం మందులు ఇచ్చి అండగా నిలవడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా శ్రీశైల మల్లన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మన రాష్ట్రం నుంచే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy