నల్లారి భవిష్యత్ ఏంటీ…?

download (1)
రాష్ట్ర విభజన జరిగిపోయింది. సమైక్య ‘కిరణ్’ .. పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన భవిష్యత్ ఏంటని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కిరణ్ పార్టీ పెడతారని ఆయన వర్గం నేతలు చెప్తున్నారు. ఇక తనతో వచ్చే వారెవరో తెలుసుకునే పనిలో పడ్డారు కిరణ్. ఇందు కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎంపీలతో సమావేశం కానున్నారు.

పార్లమెంట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిన్నటితో మగిశాయి. సమావేశాలు ముగియడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎంపీలు ఎంపీలు హర్షకుమార్, సబ్బంహరి, సాయిప్రతాప్, ఉండవల్లి అరుణ్ కుమార్, రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్ ఇవాళో రేపో రాష్ట్రానికి రానున్నారు. వీరితో సీఎం కిరణ్ సమావేశం కానున్నారు. ఎంపీలతో పాటు తనతో వచ్చే నేతలను మాత్రమే ఈ సమావేశానికి పిలవనున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీని కాదనుకున్న నల్లారి రేపటి సమావేశంలోనైనా పార్టీ స్థాపనపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇక సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కొంత మంది మాత్రం కిరణ్ పార్టీపై డైలమాలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండాలో లేక కిరణ్ వెంట నడవాలో తేల్చుకోలేక తర్జన భర్జన పడుతున్నారు.

మొత్తానికి పార్టీ పెట్టే విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా పార్టీపై సమాలోచనలు చేస్తున్నారు. పార్టీ పెట్టడం గురించి, కిరణ్ వెంట నడిచే వారి గురించి రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని సెట్ చేసేందుకు హైకమాండ్ రంగంలోకి దిగింది. దీంతో కిరణ్ వెంట వెళ్లే వారు ఉండరని పార్టీ విధేయులు చెప్తున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy