నవంబరు 14 న దావూద్ ఆస్తుల వేలం

DAWOODముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను వేలం వేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. దావూద్‌కు చెందిన హోటల్ రౌనక్ అఫ్రోజ్‌తోపాటు మరో ఐదు ఆస్తులను వేలం వేయనున్నారు. దావూద్ ఆస్తులను నవంబరు 14 న వేలం వేయనున్నట్లు స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మ్యానిప్యులేటర్ యాక్ట్ అధికారి పేపర్ ప్రకటన ఇచ్చారు. ఇందులో ఆస్తుల కనిష్ట ప్రారంభ విలువను రూ.5.54 కోట్లుగా తెలిపారు. దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ ఉంటున్న భెండి బజారులోని దమర్వాలా భవనం, దేశం విడిచి వెళ్లకముందు 80 వ దశకంలో దావూద్ నివాసం ఉన్న అదే వీధిలోని మరో భవనం, మహ్మద్ అలీ రోడ్డులోని షబ్నమ్ గెస్ట్‌హౌస్, మజగావ్‌లోని పెరల్ హార్బర్ బిల్డింగ్‌లోని ఫ్లాట్, ఔరంగాబాద్‌ జిల్లాలోని 600 చదరపు అడుగుల ఫ్యాక్టరీ స్థలం కూడా వేలం వేయనున్నారు.

ముంబైలోని మజగావ్, డోంగ్రీ, మహ్మద్ అలీ రోడ్డులో ఉన్న దావూద్ ఇబ్రహీం ఆస్తులన్నీ రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. దశాబ్దాలుగా అనేక వాణిజ్య సముదాయాలు, లాడ్జిలు, షాపులు, నివాస గృహాలను దావూద్ కూడబెట్టారు. దావూద్‌కు చెందిన రౌనక్ అఫ్రోజ్ హోటల్‌ను ముంబైకి చెందిన స్వచ్ఛంద సంస్థ దేశ్ సేవా సంస్థ 2015లో వేలం వేసినప్పుడు రూ.4.28 కోట్లకు దక్కించుకుంది. అడ్వాన్సు కింద రూ.30 లక్షలు కూడా చెల్లించింది. అయితే ప్రభుత్వం విధించిన గడువులోగా మిగతా రూ.3.98 కోట్ల చెల్లించలేకపోవడంతో మళ్లీ మొదటికి వచ్చింది. అప్పటి కంటే ప్రస్తుతం డిపాజిట్ సొమ్మును 23.72 లక్షలకు తగ్గించింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy