నవంబర్ 11న టీఆర్ఎస్ అభ్యర్థులకు కేసీఆర్ బీ-ఫారాలు

హైదరాబాద్ : ఈనెల 11న ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో పర్యటించబోతున్నారు. కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో మధ్యాహ్నం 12 నుంచి మూడు గంటల వరకు ఈ సమావేశం జరుగుతుంది. నియోజకవర్గానికి చెందిన 15 వేల మంది కార్యకర్తలు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగే సమావేశంలో పాల్గొంటారని పార్టీ తెలిపింది.

ఆ తర్వాత సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ వస్తారు. మధ్యాహ్నం 4 గంటలకు తెలంగాణ భవన్లో .. ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పార్టీ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం అవుతారు. ఈ సమావేశానికి ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులందరినీ ఆహ్వానించారు. నవంబర్ 11వ తేదీనే ఎన్నికల్లో పోటీ చేయబోతున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బీ ఫారాలు అందించనున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy