నవ వధువు అనుమానాస్పద మృతి

lavanyaహైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. వరకట్న వేధింపులకు నవ వధువు బలి అయ్యింది. వివరాల్లోకి వెళితే.. చంపాపేట్ కు చెందిన లావణ్య అనే యువతికి ఎల్బీ నగర్ లోని భరత్ నగర్ కు చెందిన శివానంద్ తో వివాహం జరిగింది. పెళ్లి జరిగి నాలుగు నెలలైంది. సోమవారం లావణ్య చనిపోయింది. అయితే ఆమెను హత్య చేశారని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. పెళ్లి జరిగిన నెల రోజుల నుంచి లావణ్యకు వేధింపులు మొదలయ్యాయని.. పెళ్లికి ఇచ్చిన కట్నం ఐదు లక్షలకు లెక్కలు చెప్పాలని అదనంగా మరో రెండు లక్షలు తీసుకురావాలని భర్త, అత్త, ఆడబిడ్డలు తరచూ తీవ్రంగా వేధిస్తున్నారని తెలిపారు. ఇదిలా ఉంటే.. లావణ్య గర్భవతి అని కట్నం తెస్తేనే గర్భం ఉంచుకోవాలని లేకుంటే అబార్షన్ చేయిస్తామని.. పదిహేను రోజుల నుంచి వేధింపులు మరింత తీవ్రమయ్యాయన్నారు. ఈ క్రమంలోనే హత్యకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. తమ కూతురిని హత్య చేసి ఉరేసుకుందని కట్టుకథలు చెపుతున్నారంటున్నారు. లావణ్య మృతికి కారణమైన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy