నష్టాన్ని పూడ్చుకునే పనిలో పడ్డ టీ కాంగ్రెస్…

77సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు డిఫెన్స్ లో పడిపోయారు. ఫలితాలపై అంతర్మథనం చేశారు. ఎన్నికల్లో ఊహించని ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న నాయకులు ప్రస్తుత కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే డిప్రెషన్ నుంచి బయటకు వస్తున్నారు. ఇన్నాళ్లూ తెలంగాణ తెచ్చింది.. ఇచ్చిందీ మేమే అన్న ధీమాతో ఉన్న టీ కాంగ్రెస్ నేతలకు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కళ్లు తెరిపించాయి. నష్ట నివారణ చర్యలపై దృష్టిపెట్టిన లీడర్స్.. గోడకు కొట్టిన బంతిలా పైకి లేవాలని వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా తెలంగాణ అవిర్బావ దినోత్సవ కార్యక్రమాలతో క్రెడిట్ కొట్టేయాలని నిర్ణయించుకున్నారు. జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావం సందర్బంగానైనా కాంగ్రెస్ పార్టీ వల్లే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్న సందేశాన్ని బలంగా ప్రజల్లోకీ తీసుకెళ్లాలని టీ కాంగ్ నేతలు నిర్ణయించారు. స్పెషల్ డ్రైవ్ ను ప్లాన్ చేశారు. జూన్ 1, జూన్ 2న కనీవినీ ఎరుగని రీతిలో సంబరాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. జూన్ ఒకటి అర్ధరాత్రి గన్ పార్క్ అమరవీరుల స్థూపంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించనున్నారు. జూన్ రెండున గన్ పార్కు నుంచి గాంధి భవన్ వరకు భారీ ర్యాలీకి ప్లాన్ చేశారు. గాంధి భవన్ తో పాటు అన్ని జిల్లా కార్యాలయాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించడంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆస్పత్రులలో పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాల వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వాల్ పోస్టర్లు, కరపత్రాలను జనాలకు పంచి గ్రామ గ్రామాన కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు సంసిద్ధమవుతున్నారు.
ఈ కార్యక్రమాల ద్వారా అందరం ఐక్యంగా ఉన్నామన్న సంకేతాలు కార్యకర్తలకు పంపేందుకు సిద్దమవుతున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy