
ప్రతి గ్రామానికి రోడ్డు, రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నెంబర్ ప్లేట్ల మార్పు తప్పనిసరి అని..ప్రతి ఒక్కరు దాన్ని పాటించాలన్నారు. ఆర్టీసీలో ఉన్న ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. త్వరలోనే 80 వోల్వో బస్సులు కొంటున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. మరో నాలుగు నెలల్లో 1300 గ్రామాలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. రోజుకు ఆర్టీసీకి రూ.2కోట్ల నష్టం వస్తుందని…ఆర్టీసీ బకాయిలను ప్రభుత్వం చెల్లించేలా కృషి చేస్తామన్నారు మహేందర్ రెడ్డి.