నాకు లంచం వద్దు : బోర్డు పెట్టిన ప్రభుత్వ ఉద్యోగి

saleem-759ప్ర‌భుత్వ ఆఫీసుల్లో లంచాలు లేనిదే ప‌నులు జ‌ర‌గ‌వ‌నే అపోహ ఉంది. త‌మ ప‌నుల కోసం ఆఫీసుల‌కొచ్చే ప్ర‌జ‌ల‌కు జ‌వాబూదారీగా అతికొద్ది మంది అధికారులే వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అందుకే ప్ర‌భుత్వ ఆఫీసుల్లో త‌మ ప‌నులు పూర్త‌వ్వ‌లంటే కాస్తో కూస్తో క్యాష్ ఇవ్వ‌క త‌ప్ప‌దనే ఫీలింగ్ ప‌బ్లిక్‌లో ఉంది. అలాంటి ప‌ద్ధ‌తి మారాలంటూ కేర‌ళ‌లోని ఓ క్ల‌ర్క్ స‌రికొత్త ప‌ద్ధ‌తిని అవ‌లంబిస్తున్నాడు. అంద‌రితో భేష్ అనిపించుకుంటున్నాడు.

కేర‌ళ‌కు చెందిన అబ్దుల్ స‌లీమ్ ప‌ల్లియ‌ల్‌తోడి అంగ‌డిపురం పంచాయ‌తీ ఆఫీసులో క్ల‌ర్క్‌గా ప‌నిచేస్తున్నాడు. లంచం అనే మాట త‌న‌కు చిరాకు తెప్పిస్తుంద‌ని చెబుతున్నాడు. ప్ర‌జ‌ల‌కు సేవ‌చేసేందుకు ప్ర‌భుత్వం త‌న‌కు రోజుకు రూ.811 నెల‌కు రూ.24,340  చెల్లిస్తోందంటూ త‌ను ప‌నిచేసే డెస్క్ వ‌ద్ద ఒక బోర్డు ఉంచాడు. అంతేకాదు త‌న సేవ‌ల‌తో ప్ర‌జ‌లు తృప్తి పొంద‌కుంటే త‌న‌కు చెప్పాల్సిందిగా ఆ బోర్డుపై రాసి ఉంచాడు.

గ‌త‌మూడేళ్లుగా ఆ పంచాయ‌తీ ఆఫీసులో ప‌నిచేస్తున్న స‌లీం త‌న పే స్కేల్ మారిన‌ప్పుడ‌ల్లా క్ర‌మం త‌ప్ప‌కుండా త‌న జీతం బోర్డుపై రాస్తున్న‌ట్లు ఆఫీస్ స్టాఫ్ చెబుతోంది. త‌మ ప‌నుల‌పై అక్క‌డికి వ‌చ్చిన కొంద‌రు వ్య‌క్తులు స‌లీం పెట్టిన బోర్డును చూసి ఫోటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంతో దేశ‌వ్యాప్తంగా వైర‌ల్ అయ్యింది. దీంతో అవినీతి లేని స‌మాజం కోసం  స‌లీంలాంటి వ్య‌క్తులు అవ‌స‌ర‌మ‌ని చాలామంది త‌మ అభిప్రాయాల‌ను షేర్ చేస్తున్నారు. ఇందులో కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు కూడా ఉన్నారు.

స‌లీం ఆఫీసు ప‌నుల‌కే ప‌రిమితం కాడు. ఇత‌ర‌త్ర స‌హాయం కోరి ఎవ‌రైన త‌న‌ద‌గ్గ‌రికి వ‌స్తే త‌న‌కు చేత‌నైనంత స‌హాయం చేస్తాడ‌న్న మంచి పేరుంది. ప‌లు గ్రామాల్లో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల హ‌క్కుల‌పై అవ‌గాహ‌న కూడా క‌ల్పిస్తున్నాడు. 40శాతం పోలియోతో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ స‌లీం ఏనాడు అది చూసి కుంగిపోలేదు. ధైర్యంగా ఫీల్డ్ ట్రిప్పులు కూడా వేస్తుంటాడు. తోటి సిబ్బందికి స‌లీం చాలా ఆద‌ర్శంగా నిలుస్తున్నాడ‌ని ఆయ‌న పై అధికారులు చెబుతున్నారు. అంతేకాదు చాలామంది గ్రామ‌స్తులు ఆఫీసుల‌కొచ్చి త‌మ‌కు కావాల్సిన ప‌నిని సంతోషంగా పూర్తి చేసుకుని పోతున్నారంటే స‌లీం వ‌ల్లేన‌ని కొనియాడారు.

4 Responses to నాకు లంచం వద్దు : బోర్డు పెట్టిన ప్రభుత్వ ఉద్యోగి

 1. kmanandsingh says:

  every one follow him

 2. M.kirankumar says:

  Froud of it

 3. ramana says:

  Request you to all the government employees learn from saleem make your self proud.

 4. Anwar says:

  Employees Icon –

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy