నాగ్ ఆఫీసర్ ట్రైలర్ రిలీజ్

Nagarujuna In Officerనాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆఫీసర్‌’. కంపెనీ పతాకంపై సుధీర్‌వర్మతో కలిసి నిర్మిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు రామ్‌గోపాల్‌ వర్మ. ఈ మూవీ ట్రైలర్ ను శనివారం(మే-12) విడుదల చేశారు.  ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మైరా శరీన్ నటిస్తోంది. ముంబై మాఫియా కథాశంగా… ఒక స్టైలిష్ పోలీసు అధికారి కథతో ఈ  సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. ‘గోవిందా గోవిందా’ తర్వాత నాగార్జున, రామ్‌గోపాల్‌ వర్మ కలిసి చేసిన ఈ చిత్రంపై   ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాలను బట్టి నాగార్జునలోని యాక్షన్‌ కోణాన్ని చూపిస్తూ, ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy