నాగ్, వెంకీ, ఎన్టీఆర్, చరణ్ కెప్టెన్లుగా క్రికెట్ టీంలు

memuహుదూద్ తుఫాను భాదితుల సహాయం కోసం ఈ నెల 30న ‘మేము సైతం’ పేరిట కార్యక్రమాన్ని జరపనుంది టాలీవుడ్. ఇందులో భాగంగా టాలీవుడ్ స్టార్స్ క్రికెట్ మ్యాచ్ ఆడనున్నారు. ఇందులో మొత్తం నాలుగు టీంలు పాల్గొననున్నాయి.నాగార్జున,రాం చరణ్ ,వెంకటేష్,జూ.ఎన్టీఆర్ లు కెప్టెన్లు గా ఉండే ఈ టీంలను డ్రా పద్ధతిలో సెలెక్ట్ చేశారు. ఒక్కో టీం లో 16 మంది సభ్యులు ఉంటారు.మొత్తం ఆరు మ్యాచ్ లు జరగనుండగా, ప్రతి మ్యాచ్ లో టీంకు ఆరు ఓవర్లు ఉంటాయి.

జూ.ఎన్టీఆర్ టీం

jntr

ఎన్టీఆర్ టీంకు శ్రీకాంత్ వైస్ కెప్టెన్ గా ఉండగా రవితేజ, నాని, అనుష్క, సాయి ధరమ్ తేజ, దీక్షా సేథ్ ఇతర నటులు ప్లేయర్లు గా ఉంటారు.

 

 

 నాగార్జున టీం…

nagarjuna

నాగార్జున టీం కు అఖిల్ వైస్ కెప్టెన్ గా ఉండగా,కళ్యాణ్ రాం,సాయి కుమార్,ప్రణీత, శర్వానంద్ ఇతర ప్లేయర్లు ఉంటారు.

 

 

వెంకటేష్ టీం 

venkateshవెంకటేష్ టీం కు మంచు విష్ణు వైస్ కెప్టెన్ కాగా, నితిన్, నారా రోహిత్,సమంత,మంచు లక్ష్మి,మంచు మనోజ్ ఇతర ప్లేయర్లు.

 

 

రాం చరణ్ టీం 

ramcharan1రాం చరణ్ టీం కు తారక రత్న వైస్ కెప్టెన్ కాగా,సుధీర్,గోపీచంద్,కాజల్,చార్మీ ఇతర ప్లేయర్లు. హైదరాబాద్ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి  స్టేడియం లో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy