ఫస్ట్ టైం.. నాగ్ తో కాజల్ జోడీ

kajalయంగ్ డైరెక్టర్ ఓంకార్‌ దర్శకత్వంలో యువసామ్రాట్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాజుగారి గది 2’.  ‘రాజుగారి గది’కి సీక్వెల్‌గా రాబోతున్న ఈ సినిమా అందాల భామ కాజల్‌ అగర్వాల్‌ గెస్ట్ రోల్ లో కన్పించనున్నట్లు టాలీవుడ్‌ టాక్. ఈ మూవీ కోసం కాజల్‌ 10 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇందులో సమంత దెయ్యంగా, సీరత్‌ కపూర్‌ డ్యాన్సర్‌గా కన్పించనున్నారు. ఈ చిత్రానికి ప్రసాద్‌ వి.పొట్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్‌.ఎస్‌ థమన్‌ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్ర చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌, పుదుచ్చేరిలో జరుగుతోంది. ‘రాజుగారి గది 2’కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.  హీరో  రానాతో కాజల్ నటించిన “నేనే రాజు నేనే మంత్రి” ఆగస్టు 11న విడుదల కానున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy