నాగ చైతన్య సినిమాకి వెరైటీ టైటిల్..!

DHU0gvMXYAE70GKఅక్కినేని నట వారసుడు నాగ చైతన్య ఫుల్ స్పీడు మీదున్నాడు. ఇటీవల ‘ప్రేమమ్’ చిత్రంతో మంచి హిట్ కోట్టిన చైతూ ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో  ‘ రారండోయ్ వేడుక చూద్దాం’ అనే చిత్రాన్ని చేశాడు. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం తర్వాత కృష్ణ ఆర్వి ముత్తు దర్శకత్వంలో ‘యుద్ధం శరణం’ అనే చిత్రాన్ని చేశాడు. లావణ్య త్రిపాఠి  హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తర్వలోనే విడుదల చేయనున్నారు. ఇక కొద్ది రోజులుగా చందూ మొండేటి దర్శకత్వంలో చైతూ ఓ చిత్రాన్ని చేయనున్నట్టు వార్తలు వస్తుండగా, తాజాగా ఈ చిత్రానికి మహా భారతంలో అర్జునుడి బిరుదు అయిన  ‘సవ్యసాచి’ ని టైటిల్ గా ఖరారు చేశారు. చైతూకి ‘ప్రేమమ్’ లాంటి హిట్ ఇచ్చిన చందూ మొండేటి టాలీవుడ్ లో ఎవరూ టచ్ చేయని కథతో ఈ సినిమా చేసేందుకు సిద్దమయ్యాడట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. చిత్ర టైటిల్ లోగా కూడా తాజాగా విడుదల చేశారు. అక్టోబర్ 6న చైతూ సమంతతో ఏడడుగులు వేయనుండగా, సెప్టెంబర్ లో చందూ మొండేటి-చైతూ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy