నాటకరంగ ప్రముఖులు చాట్ల శ్రీరాములు కన్నుమూత

chatla sri ramuluనాటకరంగ ప్రముఖులు చాట్ల శ్రీరాములు కన్నుమూశారు. సికింద్రాబాద్ రైల్వే హాస్పిటల్లో చికిత్సపొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1931లో విజయవాడలో జన్మించిన శ్రీరాములు… రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూ 1976 నుంచి నాటకరంగానికి అంకితమయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఫస్ట్ అనౌన్సర్ శ్రీరాములు పనిచేశారు. బ్రిటీష్ డ్రామా లీగ్ నుంచి బ్రిటీష్ అండ్ టీచర్ సర్టిఫికేట్ పొందారు.ఆంధ్ర నాటక కళాపరిషత్ నుంచి రెండు సార్లు బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. నాటకరంగానికి చేసిన సేవలకు ఎన్నో అవార్డులు రివార్డులు ఆయన సొంతమయ్యాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు, ఎన్టీఆర్ పురస్కారం, పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి అవార్డు పొందారు శ్రీరాములు.  ఆధునిక తెలుగు నాటకరంగంలో ఆయన సేవలు చిరస్మరణీయమైనవంటున్నారు నాటకరంగ ప్రియులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy