నాటింగ్ హామ్ టెస్ట్ : కోహ్లీ, రహానే హాఫ్ సెంచరీలు

నాటింగ్ హామ్ వేదికగా శనివారం (ఆగస్టు-18) ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ నిలకడగా బ్యాటింగ్ చేస్తుంది. కెప్టెన్ కోహ్లీ మ్యాచ్ మొత్తం తన భుజాన వేసుకుని ఎక్కువ స్కోర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కోహ్లీకి తోడు అజిక్య రహానే జోరుమీదున్నాడు. ఈ క్రమంలోనే పార్టనర్ షిప్ వంద రన్స్ దాటడమే కాకుండా వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నార. ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఫస్ట్ బ్యాటింగ్‌ కు దిగిన భారత్‌ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కి 60 పరుగులు జోడించిన ధవన్, రాహుల్‌ జోడీకి క్రిస్ వోక్స్ బౌలింగ్‌ లో బ్రేక్ పడింది. వోక్స్ వేసిన 19వ ఓవర్ నాలుగో బంతికి ధవన్(35) బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు.

ఆ తర్వాత కొంత సమయానికే లోకేశ్ రాహుల్(23) మళ్లీ వోక్స్ బౌలింగ్‌ లోనే LBW అయ్యాడు. వోక్స్ వేసిన 27వ ఓవర్ నాలుగో బంతికి పుజారా(14) రషీద్‌ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 82 రన్స్ కే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమిండాను విరాట్, రహానే నిలకడగా ఆడుతూ చక్కదిద్దరు. ప్రస్తుతం 56 ఓవర్లు ముగిసే సమయానికి 189 పరుగులు చేసింది భారత్ . కోహ్లీ(51), రహానే(53) రన్స్ తో క్రీజులో ఉన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy