నాన్నంటే..నేస్తం

fatherతల్లి ప్రేమను అందిస్తే.. నాన్న బాధ్యతను నేర్పిస్తాడు. చేయి పట్టుకుని దారి చూపుతాడు. దారితప్పితే మందలిస్తాడు. మారుతున్న కాలంతో పాటు నాన్న అనే పదానికి ఇప్పుడు అర్థాలు మారిపోయాయి. నాన్నంటే మనసులో మాటను పంచుకునే నేస్తమయ్యాడు. ఫాదర్స్ డే సందర్భంగా నాన్న కమ్మని ప్రేమపై స్పెషల్…

నాన్నంటే లోతైన గుండెలో కనిపించని కమ్మని ప్రేమ. సృష్టిలో అమ్మప్రేమ ఎంత అద్భుతమైనదో.. నాన్న ప్రేమ కూడా అంతే మధురం. పిల్లలకు చక్కని భవిష్యత్తు కోసం చమటోడ్చి.. పిల్లలను చదివించి, సక్రమ మార్గంలో నడిపించేవాడు తండ్రి. తప్పటడుగులు వేసే వయసులో పిల్లల చేయి పట్టుకుని.. వాళ్లు సెటిల్ అయ్యేవరకూ నాన్న ఆ చేయి వదలడు. జీవితాన్ని ఇస్తాడు.. జీవితంలో ముందుకు నడిపిస్తాడు నాన్న.  నవమాసాలు కనిపెంచేది అమ్మ. కానీ పిల్లల పట్ల తండ్రి ఒక బాధ్యతగా ఉంటాడు. ఒక్కమాటలో చెప్పలంటే పిల్లలకు మొదటి గురువు.. రోల్ మోడల్ తండ్రే. తాను చేసేది కూలీ పనైనా.. తన పిల్లలు మాత్రం మంచి చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేయాలని తహతహలాడతాడు తండ్రి. తను పడే కష్టం తన బిడ్డలు పడకూడదనుకుంటాడు. నానా కష్టాలు పడి పిల్లలు కోరుకున్నది ఇస్తాడు. పని చేస్తూనే.. పిల్లల కోసం టైం కేటాయించి.. వారికి ఆనందాలు పంచుతాడు తండ్రి. వాళ్లతో గడిపే కొద్ది టైంలోనే నాన్న ప్రేమను పంచుతాడు. తమ పిల్లలు నొచ్చుకోకుండా.. నాన్న నిత్యం కంటికి రెప్పలా చూసుకుంటాడు.

OB-OJ815_india0_H_20110620011255 నాన్నంటే నాటికాలం నాన్నలా కాకుండా .. ఓ ప్రెండ్ గా ఉండాలంటున్నారు నేటి కాలం ఫాదర్స్. ఒక ఫ్రెండ్ గా ఉంటూ ఫ్రెండ్లీగా పెంచాలంటున్నారు. అప్పుడే మారిన లైఫ్ స్టైల్ లో.. ఒక మంచి ఫాదర్ అనిపించుకుంటారంటున్నారు. సో ఫాదర్ ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్. తన పిల్లలకు తల్లి పాత్రలో ఉన్నా.. తన తండ్రి తనను చూసిన విధానం మర్చిపోలేనిదంటారు మహిళలు. చక్కని భవిష్యత్తు ఇవ్వడం కోసం చదివించి, మంచి సంబంధం చూసి మరొకరి చేతిలో పెట్టడంలో.. తండ్రి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాడంటున్నారు. ఒక మంచి నాన్న అనిపించుకోవడానికి తండ్రి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాడంటున్నారు.

నాన్న కూచీ అంటే అమ్మాయిలే. ప్రతి తండ్రి ఆడపిల్లలనే గారంభం చేస్తారు. కన్న కూతురులోనే తన తల్లిని చూసుకుంటాడు తండ్రి. చిన్ననాటి నుంచి కంటికి రెప్పలా పెంచుకున్న కూతురు.. పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంటే.. చిన్నపిల్లాడిలా ఏడుస్తాడు. ఎప్పటికీ తండ్రి తండ్రే. పిల్లలకు ది బెస్ట్ ఇవ్వడం కోసం నిత్యం తపిస్తాడు నాన్న.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy