నాన్నకు ప్రేమతో ఇలా ఉంది

ntrఎన్టీఆర్ 25వ మూవీ. సంక్రాంతి బరిలోకి దూకిన మొదటి కోడి. నాన్నకు ప్రేమతో టైటిల్ తోనే సెంటిమెంట్ డ్రామాను స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఫస్ట్ డే ఆడియన్స్ టాక్ చూద్దాం.

 

 

 

 

కథ

ఎన్టీఆర్, రాజేంద్రప్రసాద్ తండ్రీకొడుకులు. లండన్ లో రాజేంద్రప్రసాద్ పెద్ద వ్యాపారవేత్త. పార్టనర్ మోసం చేస్తాడు. ఇది జరిగి చాలా రోజులు అవుతుంది. కొడుకు ఎన్టీఆర్ కూడా పెద్దవాడు అవుతాడు. రాజేంద్రప్రసాద్ అనారోగ్యానికి గురవుతాడు. డాక్టర్లు కూడా 30 రోజుల కంటే ఎక్కువ బతకరు అని చెబుతారు. ఎటూ చనిపోతున్నాను కదా అని రాజేంద్రప్రసాద్.. తన కొడుకులకు ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు. లండన్ లో చాలా రిచ్ ఫ్యామిలీ అని.. పార్టనర్ మోసం చేయటంతో ఇలాంటి బతుకు బతుకుతున్నాం అని చెబుతాడు. మోసం చేసిన విలన్ జగపతిబాబు. తండ్రి పడిన బాధకు.. రివేంజ్ తీసుకోవాలని ఎన్టీఆర్ భావిస్తాడు. అందుకు టైం ఉన్నది కూడా 30 రోజులే. ఈ టైంలో విలన్ ను ఎలా రోడ్డు మీదకు తీసుకొచ్చాడు అనేదే కథ. తండ్రి రుణం తీర్చుకునే కొడుకు స్టోరీ.

కథనం

స్టోరీలో పెద్దగా ట్విస్ట్ లు ఏమీ లేవు. ఇలా జరుగుతుంది అని తెలిసీ తెలియనట్లుగా ఉంటుంది. డైరెక్ట్ గా ఉంటుంది. అంతా మైండ్ గేమ్. పెద్దగా కేకలు వేసేటువంటి సీన్స్ ఉండవు.. అలా అని బాగోలేదు అని కూడా చెప్పలేం. చాలా కూల్ గా సాగిపోతుంది. అక్కడక్కడ కథలో వచ్చే ట్విస్ట్ లను మాస్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.  ఫస్టాఫ్ బాగుంది అని ఫీలవుతారు ఆడియన్స్ . ఇక సెకండాఫ్ లో సినిమాలో వేగం కంటే.. ఆలోచనల వేగం పరిగెడుతాయి. క్లైమాక్స్ అయితే సాగదీసినట్లు ఉంది అని ఫీలవుతాడు. ఓవరాల్ గా ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు.

మేకింగ్

చాలా రిచ్ గా తీశాడు డైరెక్టర్ సుకుమార్. ఎక్కడా మాస్ అనేది కనిపించదు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో  బాగా డబ్బున్నోళ్లు ఎలా ఉంటారు.. వాళ్ల లైఫ్ స్టయిల్ ఎలా ఉంటుందో మూవీలోని క్యారెక్టర్స్ కూడా అలాగే ఉంటాయి. మల్టీఫెక్స్ లు, ఏ సెంటర్లలో జనం బాగా కనెక్ట్ అవుతారు. మూవీ మొత్తం స్పెయిన్, లండన్ లో తీశారు. 70శాతం షూటింగ్ అక్కడే తీయటంతో.. స్క్రీన్ రిచ్ గా కనిపిస్తోంది. అన్ని క్యారెక్టర్స్ రిచ్ గానే ఉంటాయి.

 

నటన

ఎన్టీఆర్ : తనస్ఠాయికి తగ్గట్టు ఇరగదీశాడు. రిచ్ లుక్స్. హైఫై సొసైటీ. యంగ్ టక్కర్ ఎలా ఉంటాడో స్క్రీన్ పై పండించాడు. డైలాగ్ డెలివరీ కూడా మిగతా సినిమాలతో పోల్చితే డిఫరంట్ గా ఉంది. ఎమోషన్స్ పండించటంలో సక్సస్ అయ్యాడు

హీరోయిన్ : రకుల్ ప్రీత్ సింగ్. గ్లామర్ పండించింది. ఊహించని బోల్డ్ సీన్స్ ఉన్నాయి. యాక్టింగ్ కంటే.. అందానికే ఎక్కువ ప్రయార్టీ కనిపించింది.

జగపతిబాబు : మరోసారి రిచ్ గెటప్ లో అలరించాడు. ఎన్టీఆర్ – జగపతి మధ్య సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. విలన్ గా జగపతి ఫెర్మార్మెన్స్ బాగుంది.

 

ఎండింగ్ :

సుకుమార్ సినిమా అనగానే మేజిక్కులు కంటే లాజిక్కులు వెతుక్కోవాలి.. బుర్రకు పదునుపెడితేగానీ అర్థంకాదు అని సగటు ప్రేక్షకుడి కామెంట్. నాన్నకుప్రేమతో మూవీలో పెద్దగా ట్విస్ట్ లు పెట్టకపోయినా మైండ్ గేమ్ గానే స్టోరీ తీసుకెళ్లాడు. నేనొక్కడినే భయం వెంటాడినట్లు కనిపించింది. ఓవరాల్ గా సినిమాను ఎన్టీఆర్ సంక్రాంతి పండగ ఫ్యామిలీ డ్రామాగా తీయటంలో సక్సస్ అయ్యాడు. నాలుగు రోజుల సెలవులతో.. కలెక్షన్స్ కూడా ఒకే చెప్పొచ్చు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy