నాన్నకు ప్రేమతో కాంట్రవర్సీస్ వన్ బై వన్

balaiah& ntrఒకే ఒక్క ఆడియో ఫంక్షన్ నందమూరి వంశంలో ఎన్నో కాంట్రవర్సీలను తెరపైకి తెచ్చింది. నాన్నకు ప్రేమతో అంటూ 25వ మూవీగా వస్తున్న ఎన్టీఆర్ స్పీచ్ నే కాదు.. హరికృష్ణ అండ్ కో డైలాగ్స్ హాట్ టాపిక్ అయ్యాయి. వన్ బై వన్ చూస్తే.. ఎన్టీఆర్ అంశ అంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే.. ఆయన వారసుడు ఎన్టీఆర్ అని ఆయనే చెప్పాడు. తారక్ పేరును తారకరామారావు అని మార్చింది కూడా ఆయనే.. నిజమైన వారసుడు ఎన్టీఆర్ అంటూ హరికృష్ణ చెప్పిన మాటలు.. నందమూరి వంశంలో వారసత్వ రాజకీయాలను తెరపైకి తెచ్చాయి. ఆడియో ఫంక్షన్ లో ఏ ఒక్కరూ కూడా బాలయ్య పేరు ప్రస్తావించలేదు. కనీసం బాలయ్య ఫ్లెక్సీ కూడా కనిపించలేదు. ఫ్యాన్స్ నుంచి బాలకృష్ణ అనే పదం కూడా వినిపించలేదు. నందమూరి వంశం అని మాత్రమే ప్రస్తావన జరిగింది. ఇక కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తాత ఎన్టీఆర్ కు నిజమైన వారసుడు నాన్న హరికృష్ణ అని గుండబద్దలు కొట్టారు. లక్ష కిలోమీటర్ల చైతన్యరథం నడిపి తండ్రికి నిజమైన వారసుడి అన్నారు. 30 సంవత్సరాలు తండ్రి వెన్నంటే ఉండి.. నిజమైన కొడుకుగా నిరూపించుకున్నారు.. ఆయన కొడుకులుగా గర్వపడుతున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. బాబాయ్ మాట ప్రస్తావించకపోవటం చూస్తుంటే.. రెండు కుటుంబాల మధ్య గ్యాప్ బాగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ మాట్లాడుతూ..  వంశం చెప్పుకోకుండా సొంత కృషితో ఎదగాలని డాడీ చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు. తాత ఇచ్చిన భిక్షతో.. సొంత కృషితో ఎదుగుతున్నామన్నారు. నాన్న ఇచ్చిన మనోధైర్యం.. చూపిన ప్రేమకు హ్యాట్సాప్ చెప్పారు. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. ఆడియోను దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తికి అంకితం ఇవ్వటం.. ఆయన ప్రస్తావనతో ఫంక్షన్ ఎమోషనల్ గా మారిపోయింది. డైరెక్టర్ సుకుమార్ తండ్రి కథే ఇది అని.. ఆయన ప్రస్తావనతో అందరి కళ్లలో నీళ్లు తిరిగారు. మేం అందరం నాన్న పిచ్చోళ్లం అంటూ ఎన్టీఆర్ చేసిన ప్రసంగం.. ఆద్యంతం ఉత్కంఠగా మార్చింది. సెంటిమెంట్ తోపాటు.. నందమూరి వంశంలో జరుగుతున్న పరిణామాలపై ఎన్నో ఆసక్తికర అంశాలను తెరపైకి తెచ్చింది.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy