నాన్నకు ప్రేమతో నిర్మాతపై పవన్ కంప్లయింట్

pavanపవన్ కల్యాణ్.. పవర్ స్టార్ ఫస్ట్ టైం ఓ నిర్మాతపై కంప్లయింట్ చేశాడు. అత్తారింటికి దారేదీ మూవీలో నటించినందుకు నిర్మాత బాకీ పడ్డాడని.. రెండు కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వలేదని మా అసోసియేషన్ కు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును నిర్మాతల మండలికి పంపించింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.  ఇంత వరకు ఈ విషయాన్ని అధికారికంగా ఎవరూ ప్రకటించకపోయినా.. ఇష్యూలో ట్విస్ట్ లు మాత్రం చాలానే ఉన్నాయి.

 

 

 

ఈ ట్విస్ట్ లు ఏంటీ?

  • పవన్ కళ్యాణ్ సొంతంగా ఫిర్యాదు చేశాడా.. లేక ఓ లేఖ ద్వారా తన కంప్లయింట్ పంపించాడా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఎవరూ కూడా స్పందించటం లేదు. మా కార్యదర్శి శివాజీ రాజాను వీ6 స్వయంగా ఫోన్ చేసి కన్ఫర్మేషన్ అడిగితే.. మీకు దండం పెడతాం.. దీన్ని వదిలేయండి అంటూ చెప్పుకొచ్చాడు.
  • అత్తారింటికి దారేదీ మూవీలో 2013 సెప్టెంబర్ 27వ తేదీ రిలీజ్ అయ్యంది. అంటే ఇప్పటికి రెండున్నర సంవత్సరాలు అయ్యింది. నిర్మాత బీవీఎన్ఎస్ ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు.. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోనే ఉన్నాడు. ఇప్పుడే సడన్ గా ఎందుకు గుర్తు వచ్చింది?
  • బీవీఎన్ఎస్ ప్రసాద్.. అత్తారింటికి దారేదీ మూవీ కలెక్షన్స్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. అలాంటిది బీవీఎస్ఎన్ ప్రసాద్ కు రెండు కోట్లు ఓ లెక్క.. ఈ పాయింట్ కూడా కంప్లయిట్ పై ఆలోచనలను రేకెత్తిస్తోంది.
  • అత్తారింటికి దారేదీ సినిమాను నిర్మించిన ప్రొడక్షన్ కంపెనీలు రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్, వెంకటేశ్వరసినీ చిత్ర. ఈ రెండింటిపైనా పవన్ కంప్లయింట్ చేశాడా.. చేస్తాడా?
  • రెండున్నరేళ్లుగా ఈ వివాదం నలుగుతూ ఉండటం చూస్తుంటే.. వపన్ – బీవీఎస్ఎన్ ప్రసాద్ మంచి స్నేహితులు అన్నది అంతా అబద్దమా. ఇద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగిందా
  • పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్ రెండు కోట్లపై కంప్లయింట్ చేశాడు అంటే.. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన మిగతా సినిమాల్లోని హీరోలకు ఇలాగే ఎగ్గొట్టాడా?
  • సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు, ఆప్తులు. ఇప్పటి వరకు త్రివిక్రమ్ రాయబారం కూడా పని చేయలేదా.
  • నాన్నకు ప్రేమతో మూవీ రిలీజ్ కాబోతుంది. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్. కరెక్ట్ టైంలో పవన్ కళ్యాణ్ దెబ్బకొట్టాడా. ఓ నిర్మాత గత సినిమాలకు బాకీ ఉన్నట్లయితే.. కొత్త సినిమా రిలీజ్ కు కష్టాలు. నిబంధనలు ఇవే చెబుతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేస్తారు?
  • నాన్నకుప్రేమతో మూవీలో కూడా బడ్జెట్ పెరిగిపోయిందని నిర్మాత ప్రసాద్ అలిగితే.. స్వయంగా ఎన్టీఆర్ తన సొంత డబ్బులు పెట్టాడని గాసిప్స్ వచ్చాయి. ప్రస్తుత వ్యవహారం చూస్తుంటే ఇది నిజమే అనుకోవచ్చా?
  • యంగ్ హీరో ఎన్టీఆర్ 25వ సినిమా నాన్నకుప్రేమతో.. ఇలాంటి మూవీ ప్రతిష్టాత్మకమైన మూవీ విడుదల సందర్భంలో పవన్ కళ్యాణ్.. నిర్మాతపై కంప్లయింట్ చేయడం ఏంటీ అనే డిస్కషన్ కూడా నడుస్తోంది?

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy