నాన్న వెంకటస్వామి స్ఫూర్తితోనే ప్రజా సేవ: వివేక్

vivekవరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ లోని ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి మాల మహానాడు సదస్సు జరిగింది‌. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ జి.వివేకానంద, మాజీ మంత్రి వినోద్ హాజరయ్యారు. అంతకు ముందు మడికొండ దగ్గర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ వివేకానందకు మాలమహానాడు నేతలు ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీతో వివేకానందను నేతలు, కార్యకర్తలు సదస్సుకు తీసుకొచ్చారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు వివేకానంద. రాష్ట్రంలో 25 లక్షల జనాభా ఉన్న మాలలు ఐక్యంగా సత్తా చాటాలన్నారు. అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. నాయకలు అంతా ఒకే వేదిక మీదికి రావాలని… అంబేద్కర్ ఆనాడు పట్టుదలతో ఉండటం వల్లే కొలంబోలో చదివారన్నారు. అంబేద్కర్ అందించిన రిజర్వేషన్లను అందరు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందరూ చదివినప్పుడే అంబేద్కర్ కన్న కలలు నిజమవుతాయన్నారు. ఎంత ఎదిగినా పేదలకు సాయం చేయాలని తమ తండ్రి వెంకట స్వామి చెప్పేవారని… ఆ స్పూర్తితోనే తామిద్దరం పనిచేస్తున్నామన్న ఆయన.. ఉన్నతస్థాయికి ఎదిగిన దళితులు పది మందికి సాయం చేయడం మరువద్దు అన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy