నాపేరు వాడొద్దు : దేవుడి చేతుల్లోనే రాజకీయ జీవితం

rajinikanth-chennaiరాజకీయ ప్రవేశంపై మరోసారి తన మనసులో మాట చెప్పారు సూపర్ స్టార్ రజినీకాంత్. రాజకీయ నాయకులు తనపేరు వాడుకుంటున్నరని.. తను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. 9 ఏళ్ల తర్వాత చెన్నైలో ఫ్యాన్స్ తో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. తమిళ ప్రజలు తనను అర్థం చేసుకుంటారన్నారు. తను ఓ నటుడునని.. దేవుడు అదే మార్గాన్ని చూపాడన్నారు. రెండు దశాబ్దాల క్రితమే రాజకీయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని.. తన రాజకీయ జీవితం ఆ దేవుడి చేతుల్లోనే ఉందన్నారు. 2008 తర్వాత 9 ఏళ్లకు తొలిసారి ఫ్యాన్స్ తో సమావేశమయ్యారు రజినీ. తమిళనాడు వ్యాప్తంగా 17 జిల్లాల నుంచి ఫ్యాన్స్ వచ్చారు. ఒక్కో జిల్లా నుంచి 200 మంది ఫ్యాన్స్ కు అవకాశమిచ్చారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy