నాయకుడంటే నువ్వేనయ్యా : బెగ్గర్ కు అంత్యక్రియలు నిర్వహించిన MLA

అనాధగా పడి ఉన్న మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకొన్నాడు ఓ MLA. మహిళ మృతదేహాన్ని గ్రామస్ధులు ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో విషయం తెలుసుకున్న MLA స్వయంగా ముందుకు వచ్చి… తన ఇద్దరు కొడుకులతో కలసి…సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఒడిషా రాష్ట్రంలో శనివారం(ఆగస్టు-4) ఈ ఘటన జరిగింది.
ఒడిషాలోని జర్సుగూడా జిల్లాలోని అమ్నపల్లి గ్రామంలో… అనారోగ్యంతో మంచాన పడి ఉన్న తన బావతో కలిసి ఓ మహిళ బెగ్గర్ గా నివసించేది. కొన్ని రోజులుగా ఆరోగ్యంతో భాధపడుతున్న ఆమె శుక్రవారం(ఆగస్టు-3) చనిపోయింది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు స్ధానికులు ముందుకు రాలేదు. ఒక రోజు అంతా ఆమె మృతదేహాన్ని గ్రామస్ధులు ఎవ్వరూ మాకేం అవసరం లేదన్నట్లుగా పట్టించుకోలేదు. బెగ్గర్ మహిళ మృదేహాన్ని ఎవరైనా టచ్ చేస్తే…తమ కమ్యూనిటీ వాళ్లు గ్రామ బహిష్కరణకు చేస్తారన్న భయంతో ఎవ్వరూ ఆమెకు అంత్యక్రియలు చేసేందుకు ముందుకురాలేదు.
ఆ ఏరియాలో జరిగబోయే షెడ్యూల్డ్ ఈవెంట్ లో పాల్గొనాల్సి ఉన్న రెంగలి బీజేడీ MLA రమేష్ పతువాకి మహిళ విషయం గురించి తెలిసింది. వెంటనే తన ప్రోగ్రామ్ ని రద్దు చేసుకొని తన ఇద్దరు కొడుకులను తీసుకొని మహిళ మృతదేహం దగ్గరకు వెళ్లాడు. తన ఇద్దరు కొడుకులతో సాయంతో మృతదేహాన్ని శ్మశానానికి తీసుకువెళ్లి సంప్రదాయబద్దంగా ఆమెకు అంత్యక్రియలు నిర్వహించాడు.MLA చేసిన పనిని అందరూ ప్రశంసిస్తున్నారు. నిజమైన దేవుడు ఆ ఎమ్మెల్యే అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన ప్రజల మనిషివని నిరూపించావయ్యా అంటూ MLAని అభినందిస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy