నార్త్ కొరియా సవాల్ : అణు యుద్ధానికి రెడీ

northకయ్యానికి కాలుదువ్వితే పర్వాలేదు.. ఏకంగా అంతానికే కౌంట్ డౌన్ పెట్టేశాడు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఫస్ట్ టైం తన ఆయుధ సంపత్తి మొత్తాన్ని ప్రదర్శించింది ఆ దేశం. నార్త్ కొరియా వ్యవస్థాపకుడు కిమ్ టు సంగ్ 105వ జయంతి సందర్బంగా ఆ దేశ రాజధాని ప్యాంగ్ యాంగ్ లో పరేడ్ నిర్వహించారు. ఇందులో ఇప్పటి వరకు వెలుగులోకి రాని స్కడ్ మిస్సైల్స్ ను ప్రదర్శించారు. వీటిలో పాటు సబ్ మెరైన్ లాంచింగ్ మిస్సైల్స్, అత్యాధునిక మొబైల్ మిస్సైల్ లాంచింగ్ వెహికల్స్ తో సవాల్ విసిరాడు. అణుపరీక్షకు కూడా సిద్ధమని వార్నింగ్ ఇచ్చాడు. సైన్యం కవాతు అయితే.. ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించారు. ప్రపంచమే నివ్వెరపోయే విధంగా అణ్వాయుధాలు, క్షిపణిలతో పెద్దఎత్తున పరేడ్ చేయటం చర్చనీయాంశం అయ్యింది. ఈ పరేడ్ లో అమెరికాపై పరోక్షంగా విరుచుకుపడ్డాడు ఆ దేశ ప్రతినిధి రియాంగ్. యుద్ధం అంటూ వస్తే యుద్ధంతోనే సమాధానం చెబుతాం.. అణుదాడినైనా సరే.. అణుదాడితోనే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం అని వ్యాఖ్యలు చేయటం సంచలనం అయ్యింది. పరేడ్ లో ప్రదర్శించిన అణ్వాస్త్రాలపై ఇప్పటికే అమెరికా విశ్లేషణ చేస్తుంది. ఉత్తరకొరియా వైఖరిపై ఆచితూచి స్పందిస్తోంది. ఆ దేశానికి 500 కిలోమీటర్ల దూరంలో మోహరించిన బలగాలకు ఎప్పటికప్పుడు అలర్ట్ పంపుతోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy