నార్త్ లో జడ దడ : జుట్టు కత్తిరిస్తున్నారంటూ మహిళల గగ్గోలు

hair-devilఉత్తరాదిన దడ పుట్టిస్తున్నారు జడ సైకోగాళ్లు. మహిళలకు జడ కొత్త అందాన్ని తీసుకువస్తుందంటారు. పొడుగాటి జడలపై సహజంగా వాళ్లకు మక్కువ ఎక్కువ. అయితే అలాంటి జడలను కత్తిరించి బెంబేలెత్తిస్తున్నారు. ఇప్పటి వరకు 55 మంది మహిళల జడలను కత్తిరించేశారు. రాజస్థాన్‌, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ పరిధిలోని గ్రామాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. విచిత్రం ఏంటంటే జడలను కత్తిరించేవారు ఎవరికీ ఎలాంటి హానీ చేయడంలేదు. కొట్టడం కానీ, దొంగతనం చేయడం కానీ ఉండటం లేదు.

విచిత్రంగా జడలనుమాత్రమే కత్తిరిస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఈ  ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అమ్మాయిలను స్కూళ్లకు కూడా పంపడం లేదు. భయం భయంగా ఉంటున్నారు. కొందరైతే దీన్ని మంత్రగాళ్ల పని అంటున్నారు. జడలో ఉన్న శక్తిని మంత్రగాళ్లు లాగేసుకున్నారు అని వాపోతున్నారు. అయితే పోలీసులు మాత్రం.. ఆకతాయిల పనిగా కొట్టేస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులతో ఈ ఘటనలపై దర్యాప్తు చేయిస్తున్నారు.

స్థానికులు మాత్రం ఇది క్షుద్రశక్తులు, మంత్రగాళ్ల పనిగానే నమ్ముతున్నారు. స్థానిక జ్యోతిష్యులు, పండితుల సలహా మేరకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గ్రామం చుట్టూ రక్షారేఖలను గీయిస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy