నాలా బిల్లుకు గవర్నర్ ఆమోదం

1ఆంధ్రప్రదేశ్‌ నాలా బిల్లుకు ఎట్టకేలకు ఆమోదం తెలిపారు గవర్నర్‌ నరసింహన్‌. ప్రభుత్వం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన ఆయన ఆర్డినెన్స్ కు ఆమోదముద్ర వేశారు. గతంలో ఈ బిల్లును తిప్పిపంపిన గవర్నర్‌ బుధవారం మరోసారి వెనక్కి పంపారు. గతంలో ఆర్డినెన్సు రూపంలో తెచ్చినప్పుడు లేవనెత్తిన అభ్యంతరాలనే గవర్నరు మరోమారు వ్యక్తం చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ బిల్లుపై ప్రభుత్వం గురువారం మరోసారి గవర్నర్‌కు వివరణ ఇచ్చింది. దీనిపై సంతృప్తి చెందిన ఆయన ఎట్టకేలకు నాలా బిల్లుకు ఆమోదముద్ర వేశారు. ఇటీవల ముగిసిన రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ఏపీ వ్యవసాయ భూమి (సాగేతర అవసరాలకు భూమి మళ్లింపు- నాలా) చట్టానికి సవరణలు చేస్తూ బిల్లును ఆమోదించారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy