నాలుగు అంచెల జోనల్ వ్యవస్థ

zoneskadiyamకొత్త జోనల్ విధానం కోసం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేయాల్సి ఉందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. కొత్త జోనల్ సవరణపై కడియం శ్రీహరి అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది.

ఏపీ రీ ఆర్గనైజింగ్ చట్ట ప్రకారం ఆర్టికల్ 371(డి) అమల్లో ఉందని రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వర్తిస్థాయ‌ని తెలిపారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. రాష్ట్ర విభజన కొత్త జిల్లాలకు అనుగుణంగా జోన్ల సంఖ్య, పోస్టుల విభజనపై విస్తృతంగా కసరత్తు చేయాలన్నారు. ఈ రెండు అమలు క్రమంలో జోనల్ వ్యవస్థపై ఎలా ముందుకు వెళ్లాలని చర్చించామన్నారు. ప్రస్తుతమున్న 2 జోన్ల స్థానంలో మొత్తం 5 జోన్లు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో మూడంచెల జోనల్‌ వ్యవస్థ అమల్లో ఉంది.

రాష్ట్రస్థాయి, జోనల్, జిల్లా స్థాయిగా పరిగణించే ఈ విధానానికి తగినట్లుగా పోస్టులు, ఉద్యోగులున్నారు. కొత్త వ్యవస్థలో ఈ మూడంచెల విధానాన్ని నాలుగంచెలుగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రస్థాయి, జోనల్, జిల్లా స్థాయితోపాటు కొత్తగా మల్టీ జోన్లను ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి తేవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల జరిగిన సమావేశంలోనే తన ఆలోచనలను అధికారులతో పంచుకున్నారు. ప్రస్తుతం సెక్రటేరియట్, హెచ్‌వోడీలు, సొసైటీలు, కార్పొరేషన్లు రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలో లేవు. కొత్త వ్యవస్థలో తీసుకునే నిర్ణయంతో ఇవన్నీ రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి చేరతాయి. తద్వారా సొసైటీలు, కార్పొరేషన్ల నియామకాలు సైతం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) పరిధిలోకి తీసుకువచ్చే వీలుంటుంది.

ఇందు కోసం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలను సంప్రదిస్తామని తెలిపారు. అందరి అభిప్రాయాలను తీసుకుంటామని కడియం తెలిపారు. ఉన్నతస్థాయి కమిటీ సమావేశాలు చాలా జరగాల్సి ఉందన్నారు. ఉద్యోగ నియామకాల్లో స్థానికుల ప్రయోజనాలను కాపాడాల్సిన అసవరం ఉందన్నారు. కమిటీ ఈ నెల 21న మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కడియం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy