నాలుగు టీఆర్ఎస్ – రెండు కాంగ్రెస్

webస్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొత్తం 12 స్థానాలకు 10 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. ఇప్పటికే 6 స్థానాలు ఏకగ్రీవం కాగా.. ఈ నెల 27న జరిగిన పోలింగ్  రిజల్ట్స్ రిలీజయ్యాయి. ఫలితాల్లో ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. నల్లగొండ, మహబూబ్ నగర్ లో ఓ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది.

 

 

 

ఖమ్మంలో..

TRS WINNER BALASANI

TRS WINNER BALASANI

ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. 38 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి బాలసాని లక్ష్మీ నారాయణ గెలిచారు. మొత్తం 692 ఓట్లు పోలయ్యాయి.  వీటిలో  టీఆర్ఎస్ 316, సీపీఐ 285,  వైసీపీ 102 దక్కించుకున్నాయి. నోటాకు ఒక ఓటు పడింది. ఒక చెల్లని ఓటును గుర్తించారు అధికారులు.

 

 

 

నల్లగొండలో..

RAJAGOPAL

RAJAGOPAL

నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.  193 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విక్టరీ కొట్టారు. మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్ 642, టీఆర్ఎస్ 449, స్వతంత్ర అభ్యర్థులు మల్లేశ్ 1, పురుషోత్తమ్ 2 సాధించారు. ఆరు ఓట్లను చెల్లనివిగా గుర్తించారు అధికారులు.

 

 

 

 

మహబూబ్ నగర్ 1లో..

KASIREDDY NARAYANA REDDY

KASIREDDY NARAYANA REDDY

జిల్లాలో మొత్తం రెండు స్థానాల్లో తొలి స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లలో కసిరెడ్డి 445 ఓట్లతో గ్రాండ్ విక్టరీ సాధించారు.

 

 

 

 

 

మహబూబ్ నగర్ 2లో..

K. DAMODAR REDDY

K. DAMODAR REDDY

రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రెడ్డి 379 ఓట్లతో గెలుపు తన ఖాతాలో వేసుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్వర్ రెడ్డి 273, టీడీపీ అభ్యర్థి కొత్తకోట దయాకర్ రెడ్డి 152 ఓట్లు సాధించారు.

 

 

 

 

రంగారెడ్డి 1లో..

P.NARENDER REDDY

P.NARENDER REDDY

జిల్లాలోని రెండు స్థానాల్లో మొదటి స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి  పట్నం నరేందర్ రెడ్డి 252 ఓట్లతో గెలుపొందారు.

 

 

 

 

 

రంగారెడ్డి 2లో..

SHAMBIPUR RAJU

SHAMBIPUR RAJU

రెండో స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి శంభీపూర్ రాజు 255 ఓట్లతో విజయం సాధించారు.

 

 

 

 

 

 

ఏకగ్రీవం అయిన స్థానాలు:

కరీంనగర్ జిల్లాలో (2) : నారదాసు లక్ష్మణ్ రావు(టీఆర్ఎస్), భానుప్రసాద్ రావు(టీఆర్ఎస్)

నిజామాబాద్ జిల్లాలో(1) : టీఆర్ఎస్ అభ్యర్థి రేకులపల్లి భూపతిరెడ్డి

వరంగల్ జిల్లాలో(1) : టీఆర్ఎస్ అభ్యర్థి కొండా మురళీధర్ రావు

ఆదిలాబాద్ జిల్లాలో(1) : పురాణం సతీశ్(టీఆర్ఎస్)

మెదక్ జిల్లాలో(1) : భూపాల్ రెడ్డి(టీఆర్ఎస్)

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy