నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌

1142_banks-closedఇప్పటికే అరకొర నగదు, పని చేయని ఏటీఎంలతో సమస్యలు ఎదుర్కొంటున్న ఖాతాదారులకు వరుస సెలవుల రూపంలో ఇబ్బందులు పెరగనున్నాయి. బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. శనివారం(ఆగస్టు-12) నుంచి(ఆగస్టు-15) వరకు వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈనెల 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న శ్రీకృష్ణ జన్మాష్టమి, 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ఈ 4 రోజులు బ్యాంకుల్లో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఆన్‌లైన్, డిజిటల్‌ లావాదేవీలు యథావిధిగా సాగుతాయి.   ఈనెల 25 నుంచి కూడా వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. 25న వినాయక చవితి, 26న 4వ శనివారం, 27న ఆదివారం కావడంతో మూడు రోజులు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy