నాలుగో పెళ్లికి సిద్ధమైన సర్కిల్ ఇన్‌స్పెక్టర్.. భార్య న్యాయపోరాటం

హైదరాబాద్:- ఆసిఫాబాద్ సీఐ రాజయ్య తనను ప్రేమ వివాహం చేసుకొని మోసం చేశాడని తనకు న్యాయం చేయాలని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ను కలిసింది రేణుక అనే మహిళ. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని… తనతో పాటు ముగ్గురు పిల్లలను వదిలేసి తనకు అన్యాయం చేశాడని ఆమె ఆరోపిస్తోంది. ముగ్గురు పిల్లలతో కలిసి రాచకొండ కమిషనరేట్ కు వచ్చి ఫిర్యాదు చేసింది రేణుక.

రాచకొండ సీపీ తనకు న్యాయం చేస్తానన్నారని బాధితురాలు రేణుక చెప్పింది. 2009లో తాండూరు పోలీస్ స్టేషన్ లో ఓ కేసు విషయంలో పిర్యాదు చేయడానికి వచ్చిన తనను సీఐ రాజయ్య లొంగదీసుకుని మోసపు పెళ్లి చేసుకున్నాడని బాధపడింది. తాను అనాధనని చెప్పిన బాధితురాలు.. పోలీసులే న్యాయం చేయాలని కోరింది.

“నారాయణ గూడెం గ్రామానికి చెందిన కొలుకపల్లి రాజయ్య మేనత్త కూతురు సైదమ్మను మొదటి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత కోదాడకు చెందిన శ్రీవాణిని పెళ్లిచేసుకున్నప్పటికీ.. కొన్ని కారణాలతో విడిపోయారు. ఈ విషయం సీక్రెట్ గా ఉంచి.. తాండూరుకు చెందిన నన్ను 2009 మే లో  ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. మాకు ముగ్గురు కొడుకులు పుట్టారు. ఈ మధ్య బాగా గొడవపడుతూ.. పిల్లలను అసలే పట్టించుకోవడం లేదు. మళ్లీ ఇప్పడు.. రీటా అనే మహిళతో నాలుగో పెళ్లికి సిద్ధపడ్డాడు. మమ్మల్ని వీధిపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు” అని బాధితురాలు చెప్పింది. డిపార్టుమెంట్ లో ఉన్నతమైన పోస్టులో ఉన్నానని… ఎవ్వరేం చేయలేరని బెదిరిస్తున్నాడంది.

సర్వీస్ రికార్డులో తమ పేరు నమోదు చేసి.. తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని.. మరే మహిళకు ఇలాంటి పరిస్థితి రాకూడదని, ఇలాంటి వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని బాధితురాలు రేణుక సరూర్ నగర్ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మహిళా పోలీస్ స్టేషన్ లోనూ కంప్లయింట్ ఇచ్చింది.  పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy