నాలుగో విడత హరితహారం : 39 కోట్ల మొక్కలు లక్ష్యం

skjoshi నాలుగో విడత హరితహారం కార్యక్రమంలో 39 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి SK జోషి. సీఎస్ ఎస్‌కే జోషి అధ్యక్షతన ఇవాళ రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్లర్లు, ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లాలు, శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యంపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ మొక్కలు నాటి వదలకుండా ఆయా శాఖలే సంరక్షణ చేపట్టాలన్నారు. మొక్కల ఎదుగుదల, బతికిన మొక్కల శాతంపై నెలవారీ నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. రైతులతో వెదురు, టేకు పెంపకానికి ప్రోత్సాహకం అందజేస్తామని తెలిపారు జోషి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy