నాసా మరో అద్భుతం..సూర్యుడి లోపల ప్రయోగం

SUN NASAప్రయోగాలకు మారుపేరైన నాసా మరో చారిత్రాత్మక ప్రయోగానికి రెడీ అవుతోంది. అంతరిక్ష ప్రయోగాల్లో మరో కీలక ఘట్టం రానున్న జూలైలో ఆవిష్కృతం కానుంది. ఇప్పటివరకు చేపట్టిన ప్రయోగాలు ఒక ఎత్తయితే.. జూలైలో చేపట్టబోతున్న ఈ ప్రయోగం మరో ఎత్తు. ఎర్రటి ఎండనే భరించలేని క్రమంలో డైరెక్టుగా సూర్యుడి దగ్గరకే వెల్లి, ఈ రిసెర్చ్ చేయడం రికార్డ్ అంటున్నారు. కన్నెత్తి డైరెక్ట్ గా కూడా చూడలేని సూర్యుడిపైనే ఈ ప్రయోగాన్ని చేపట్టనుండటమే దీని ప్రత్యేకత. తొలిసారి సూర్యుడి వాతావరణాన్ని శోధించేందుకు పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ మిషన్‌ను చేపట్టనుంది నాసా. జూలై 31న చేపట్టనున్న ఈ ప్రయోగం కోసం ఫైనల్ దశ సన్నాహాలు జరుగుతున్నాయి.

కొన్ని రోజుల క్రితమే ఈ ప్రయోగానికి సంబంధించిన అంతరిక్ష నౌకను అమెరికా వాయుసేన ఫ్లోరిడాకు తరలించింది. మూడో దశలో భాగంగా ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ లోని డెల్టా–4 హెవీ లాంచింగ్‌ వెహికల్‌ కు దీనిని అనుసంధానం చేస్తారు. ఇప్పటివరకు ఏ అంతరిక్ష నౌక కూడా ప్రవేశించని సూర్యుడి కరోనా కక్ష్యలో ఈ నౌక పరిభ్రమించనుంది. ఆ ప్రాంతంలో ఉండే వేడి, రేడియేషన్‌ తట్టుకుని సౌర గాలులు ఏర్పడటానికి గల ప్రాథమిక కారణాన్ని కనుగొననుంది. రానున్న 2 నెలలు పూర్తిస్థాయిలో నౌకకు పరీక్షలు చేపట్టి.. సూర్యుడి వేడిని తట్టుకునే కీలకమైన థర్మల్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌ (TPS)ను ఏర్పాటు చేయనున్నారు. ఏడేళ్ల సుదీర్ఘ సమయంపాటు ఇది సూర్యుడి కరోనా కక్ష్యలో పరిభ్రమించనున్నట్లు తెలిపారు ఈ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఆండీ డ్రైస్‌మన్‌. ఏళ్లపాటు శాస్త్రవేత్తల మెదళ్లను తొలుస్తున్న అనేక ప్రశ్నలకు ఈ ప్రయోగం ద్వారా సమాధానం లభించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy