“నా అటల్ జీ..” మోడీ భావోద్వేగ బ్లాగ్ పోస్ట్

అటల్ బిహారీ వాజ్ పేయిపై తన అభిమానాన్ని బ్లాగులో వ్యాసరూపంలో చాటుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఆనాడు గుర్తులకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ‘ఎ లీడర్‌ ఫర్‌ ది ఏజెస్‌, హి వాజ్‌‌ ఎహెడ్ ఆఫ్‌ టైమ్స్‌’ పేరుతో రాసుకొచ్చిన ఈ బ్లాగ్ పోస్టులో.. “మేరే అటల్‌ జీ.. మీరు ఈ దేశానికి దిక్సూచి. ఆదర్శానికి నిలువెత్తు నిదర్శనం. మాటలకందని మంచితనం అంటూ.. వాజ్ పేయి వ్యక్తిత్వం, గొప్పతనాన్ని నరేంద్రమోడీ  కొనియాడారు.

“అల్లకల్లోలం, ప్రమాదకర పరిస్థితుల్లో దేశానికి ఓ నేత వచ్చారు. జనానికి దిశానిర్దేశం చేశారు. ఆయనే అటల్‌ బిహారీ వాజ్ పేయి. కలిసిన ప్రతి ఒక్కరిని కదిలించే, స్ఫూర్తినిచ్చే అరుదైన వ్యక్తి ఆయన. ధైర్యవంతుడు. ఆయనంటే అందరికీ గర్వకారణమే. అద్భుతమైన వాక్పటిన.. సెన్సాఫ్ హ్యూమర్ ఆయన సొంతం. మధ్యప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో ఉన్నతమైన ఆదర్శాలు కలిగిన కుటుంబంలో పుట్టారు. చిన్న వయసు నుంచే ప్రజాసేవకు అంకితమయ్యారు. జనసంఘ్‌లో చిన్న కార్యకర్తగా జీవితాన్ని మొదలుపెట్టి.. అంచెలంచెలుగా ఎదిగారు. పార్లమెంట్‌లో నాలుగు దశాబ్దాలు నాయకుడిగా ఉన్న ఆయన.. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవించారు. నేటి తరాలకు ఆదర్శంగా నిలిచారు” అని రాసుకొచ్చారు మోడీ.

“ప్రపంచ వేదికలపై భారత్‌ను సరికొత్తగా పరిచయం చేశారు. దేశాన్ని ప్రగతి దిశగా నడిపించారు. వ్యక్తిగతంగా ఆయన నాకు గురువు, ఆదర్శప్రాయుడు. 2001 అక్టోబరులో ఓ రోజు సాయంత్రం ఆయన నన్ను పిలిచి గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోవాలన్నారు. అప్పుడు నేను ఆర్‌ఎస్‌ఎస్‌ కోసమే పనిచేస్తానని చెప్పాను. ఆయన మాత్రం.. ప్రజల కలల్ని నిజం చేయగల సత్తా నీకుంది అని చెప్పారు. అందుకు నేను ఎంతో గర్వపడుతున్నా. ఇప్పుడు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కానీ, ఎప్పటికీ ఆయన ఈ దేశానికి నిజమైన భారత రత్నం. ఆయన ఆదర్శాలు నేటి తరానికి మార్గనిర్దేశనం చేస్తాయి. ఆటల్ జీ కలలుగన్న నవభారతాన్ని మేం నిర్మిస్తాం’ అంటూ మోదీ తన వ్యాసంలో స్పందించారు.

 

 

 

https://www.narendramodi.in/a-leader-for-the-ages-he-was-ahead-of-the-times-541152

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy