నా ఇంట్లో సీబీఐ దాడులు చేస్తే..దొరికేవి మప్లర్లే

arvind-kejriwalసీబీఐ అధికారులు తన నివాసంలో సోదాలు చేస్తే.. మఫ్లర్లు మాత్రమే దొరుకుతాయన్నారు ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌. సీబీఐ అధికారులతో దాడులు చేయించిన ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహారం కంటితడుపు చర్య అన్నారు. ఈ నెల 15న ఢిల్లీలో సీఎం కార్యాలయంపై సీబీఐ దాడులు జరిగాయి.

ఇటీవల ట్రాన్స్ పోర్టు శాఖలో  అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ ముగ్గురు అధికారులను సస్పెండ్‌ చేసిన విషయంపై కేజ్రీవాల్ స్పందించారు. ఈ కేసులపై విచారించాల్సిందిగా సీబీఐ అధికారులకు ఢిల్లీ ప్రభుత్వం సూచిస్తుందన్నారు.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy