నా కామెంట్స్ బాధపెట్టి ఉంటే క్షమించండి: షారుఖ్

sharukఅసహనంపై తాను చేసిన కామెంట్స్ ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు  సినీ నటుడు షారుఖ్ ఖాన్. షారుఖ్ తన బర్త్ డే రోజు చేసిన కమెంట్స్ పై ABP NEWS స్పెషల్ లో మాట్లాడాడు షారుఖ్….ఎవరైనా తన మాటలతో  బాధపడి ఉంటే క్షమించమని కోరాడు. ABP NEWS అడిగిన క్వశ్చన్స్ కి కూల్ గా ఆన్సర్ చేసాడు షారుఖ్. నేను ఇండియాలో చాలా హ్యపీగా ఉన్నాను…ఒకసారి మాత్రం నా పై కొంచెం అసహనం చూపించారు.. అదికూడా నా తప్పు కారణంగానే జరిగిందన్నారు షారుఖ్ . పబ్లిక్ లో స్మోక్ చేయటమే తాను చేసిన పొరపాటన్నారు. యూత్ ఎప్పుడు క్యాస్ట్, కలర్, జెండర్, రెలిజియన్, రీజియన్ విషయాలలో డిఫరెన్స్ చూపించకూడదన్నారు. ఇది ఫ్యూచర్ జనరేషన్ కి మంచిది కాదన్న షారుఖ్..మన దేశానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుడదు..గాడ్ బ్లెస్ ఇండియా అని అన్నాడు. అలాగే నేనేదో నా ఫిల్మ్ దిల్వాలే కోసం ఇలా మాట్లాడుతున్నానని కొందరు మాట్లాడుతున్నారు. నా ఫిల్మ్ చూడ్డం… చూడకపోవడం చూసేవాళ్ల ఇష్టం. నేనెవరిని ఫోర్స్ చేయనన్న షారుఖ్ ఇకపై తాను ఏం మాట్లాడినా సినిమాల గురించే మాట్లాడుతానంటూ ముగించాడు షారుఖ్. మరోవైపు  BJP జనరల్ సక్రటరీ కైలాష్ విజయ్ వర్గియ.. షారుఖ్ ఇండియాలో ఉన్నా…ఆయన మనసంతా పాకిస్తాన్ పై ఉందని ట్వీట్ చేసారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy