నా కొడుకును సునామీ మింగేయలేదు.. తప్పక వస్తాడు

tsunami2004లో సునామీ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఎంతో మంది ఆత్మీయులను కోల్పోయారు. ఆ బాధ ఎన్నేళ్లైనా వెంటాడుతూనే ఉంటుంది. అందులో సందేహమే లేదు. కానీ ఓ వ్యక్తి మాత్రం దూరమైన కొడుకు కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆ మహా ప్రమాదం జరిగి 11 ఏళ్లైనా తన కొడుకు ఇంకా వస్తాడనే విశ్వాసంతో కాలం గడుపుతున్నాడు ఆ తండ్రి.

ఆయన పేరు వెంకటరామన్. కొడుకు పేరు అరవింద్. వెంకటరామన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ ఉద్యోగి. 2004లో నికోబార్ దీవిని సునామీ తాకింది. ఆ సమయంలో ఎయిర్ ఫోర్స్ అధికారులను చెన్నై సమీపంలోని తాంబరానికి తరలించింది ఐఏఎఫ్. రెండో రోజు అరవింద్ గురించి అధికారులను అడిగితే పోర్ట్ బ్లెయిర్ లో ఉన్నాడని చెప్పారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు అరవింద్ జాడలేదు. కానీ ఆ తండ్రిలో మాత్రం ఏదో ఆశ.. అదే నమ్మకం. తన కొడుకు ఎప్పటికైనా తిరిగొస్తాడని దృఢంగా నమ్ముతున్నారు వెంకటరామన్. 11 ఏళ్లుగా కుమారుడిని వెతికేందుకు 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అరవింద్ కు 75 ఏళ్ల ఆయుష్షు ఉందని.. 2016 జనవరి 11 నుంచి 2017 జనవరి 11 మధ్య కాలంలో ఎప్పుడైనా రావొచ్చు అని తమ జ్యోతిష్కుడు చెప్పాడంటున్నారు. దీనికోసం ఆయన ఏటా డిసెంబర్ 26న గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు వెంకటరామన్ దంపతులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy