“నా నువ్వే’’లో అలరించనున్న కళ్యాణ్ రామ్

ntrనంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ నిర్మాత‌గాను, న‌టుడిగాను వైవిధ్య‌మైన ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఇటీవ‌ల ఎంఎల్ఏ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన క‌ళ్యాణ్ రామ్ త్వ‌ర‌లో నా నువ్వే అనే చిత్రంతో అల‌రించ‌నున్నాడు. త‌మన్నా క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం మే 25న విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మైంది. ఇక సినిమాటోగ్రాఫర్ గుహన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడు క‌ళ్యాణ్ రామ్. తాను ఎప్పుడు చేయ‌ని జాన‌ర్‌లో ఈ సినిమా ఉంటుంద‌ని తెలుస్తుంది. థ్రిల్లర్‘‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన అర్జున్ రెడ్డి భామ షాలినీ పాండే, ‘నిన్ను కోరి’ హీరోయిన్ నివేదా థామస్‌లు నటించనున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమా కొద్ది సేప‌టి క్రితం పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. లాంచింగ్ ఈవెంట్‌కి నంద‌మూరి రామ‌కృష్ణ‌, నంద‌మూరి హ‌రికృష్ణ, జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy