నా పేరు సూర్య సెన్సార్ పూర్తి

SURYAస్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 4న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. దీంతో ప్రచార కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా సెన్సార్ పనులకు కూడా ఫినిష్ చేసుకుంది. ఈ సినిమాకు  U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. బన్నీ ఆర్మీ ఆఫీసర్‌ గా కనిపిస్తున్న ఈ సినిమా కోసం  సైనికుడిగా కనిపించేందుకు తన లుక్‌ను పూర్తిగా మార్చేసుకున్నాడు. స్టైలిష్ స్టార్‌ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను లగడపాటి శ్రీధర్, నాగబాబు నిర్మించారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో ఏప్రిల్ 22న రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే టీమ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy