నా రాజ్యం.. నేనే రాజు : ఈజిప్ట్ లో దేశాన్ని సృష్టించిన ఇండియన్

MENఇండియన్.. ప్రపంచ మేధావుల్లో ఎక్కువ మంది. సృష్టించకపోయినా.. సృష్టించిన వ్యవస్థలను నడిపించగల సత్తా ఉన్నోళ్లుగా చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు ఓ ఇండియన్ ఏకంగా ఒక దేశాన్ని సృష్టించి.. దానికి రాజు కూడా అయిపోయాడు. అది మన దేశంలో కాదు ఈజిప్ట్ – సుడాన్ బోర్డర్ లో. పూర్తి వివరాల్లోకి వెళితే..

అది ఈజిప్ట్ – సుడాన్ దేశాల సరిహద్దు. బిర్ తావిల్ అనే ప్రాంతంలో 319 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎడారి ఉంది. ఈ భూమిపై అటు ఈజిఫ్ట్, సుడాన్ ఏ దేశం కూడా క్లయిమ్ చేసుకోలేదు. ఊరికే పడి ఉంది. తీవ్రవాదుల సంచారం కావటంతో ఎవరూ కూడా అటువైపు కన్నెత్తి చూడరు. ఎవరైనా ఆ ప్రాంతానికి వెళ్లాలంటే ఆర్మీ అనుమతి తప్పనిసరి. టూరిజంపై ఈజిప్ట్ వెళ్లిన భారతదేశం ఇండోర్ వ్యాపారి సుయాష్ దీక్షిత్.. బిర్ తావిల్ ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే పోరాడి మరీ ఈజిప్ట్ ఆర్మీ దగ్గర అనుమతి తీసుకున్నాడు. తండ్రితో కలిసి ఆ ప్రాంతానికి ప్లాన్ ప్రకారం అన్ని తీసుకుని వెళ్లాడు.

అక్కడికి వెళ్లిన తర్వాత మన సూయాష్ దీక్షిత్.. ఈ 319 ఎకరాల భూమి ఏ దేశానికి కాదు కాబట్టి.. నేనే రాజు.. నేనే మంత్రి అని ప్రకటించుకున్నాడు. తన వెంట తీసుకెళ్లిన సన్ ఫ్లవర్ విత్తనాలు ఆ ప్రాంతం అంతా చల్లాడు. విత్తనాలు నేనే చల్లాను కాబట్టి ఇది నా రాజ్యం అని స్వయంగా ప్రకటించేసుకున్నాడు. కింగ్ సుయాష్ వన్ గా రాజ్యానికి నామకరణం చేశాడు. రాజధాని పేరును సుయాష్ పూర్ గా పెట్టాడు. తనకు తాను రాజుగా ప్రకటించుకున్నాడు. తన తండ్రిని ప్రధానమంత్రి, మిలటరీ చీఫ్ గా నియమించాడు. ఈ ప్రాంతంలో జెండా పాతి.. ఇది నా రాజ్యం అంటూ ఏకంగా ఐక్యరాజ్యసమితికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు.

కొత్త రాజ్యం ఏర్పాటుని పిచ్చోడిగా చూడొద్దని కూడా సలహా ఇచ్చాడు. ఈ రాజ్యానికి బల్లిని జాతీయ జంతువుగా ప్రకటించాడు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇది మాత్రమే కనిపించిందని.. అందుకే దాన్ని ప్రకటించానని తెలిపాడు. ఇప్పుడే వ్యవసాయం మొదలుపెట్టానని.. త్వరలోనే ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్స్ (FDI) తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపాడు. దీని కోసం ఓ వెబ్ సైట్ కూడా తయారు చేశాడు. ఓ రాజ్యం గుర్తింపునకు కావాల్సిన అన్ని డాక్యుమెంట్లతో ఐక్యరాజ్యసమితికి పిటీషన్ పెట్టాడు. ఈ వివరాలను ఫేస్ బుక్ ద్వారా వెల్లడించటంతో ఇది గ్లోబల్ వైరల్ అయ్యింది. అసలే టెర్రరిస్ట్ ఏరియా.. అక్కడ రాజ్యం ఏర్పాటు.. ఈ సుయాష్ ను ఏమనాలి.. ఏమంటారో మీ ఛాయిస్..

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy