నా విజన్ వల్లే హైదరాబాద్ అభివృద్ధి: చంద్రబాబు

babu nijamతెలుగు రాష్ట్రాలు రెండూ తనకు రెండు కళ్లు లాంటి వని మరోసారి స్పష్టం చేశారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు. నిజాం కాలేజీ గ్రేటర్ ఎన్నికల శంఖారావంలో పాల్గొన్న ఆయన.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ కూటమిదే విజయమని చెప్పారు. హైదరాబాద్ లో విద్యా, రవాణాభివృద్ధి తన విజన్ వల్లే సాధ్యమయ్యిందని..  తెలంగాణ అభివృద్ధికి టీడీపీ కట్టుబడి పని చేసిందని తెలిపారు. విశ్వపటంలో హైదరాబాద్ ఉంచిన ఘనత టీడీపీదేనని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ లో టీడీపీ-బీజేపీ జెండా ఎగరేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. ఈ సభలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, దత్తాత్రేయ, ఎంపీలు మల్లారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, టీడీపీ – బీజేపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy