నింగికేగనున్న ప్రతిష్ఠాత్మక GSLV F09 రాకెట్

isro-l-iansదక్షిణాసియా దేశాలు ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగిస్తున్న GSLV F-09 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోట లోని షార్ అంతరిక్ష కేంద్రంలో మధ్యాహ్నం ప్రారంభమైన ఈ కౌంట్ డౌన్ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు నింగిలోకి దూసుకుపోనుంది. అయితే ఈ ఉపగ్రహం వల్ల దక్షిణాసియా శాటిలైట్ (ఎస్‌ఏఎస్) పాకిస్థాన్ మినహా ఇతర సార్క్ సభ్య దేశాల కోసం కూడా ఉపయోగపడనుంది. దీని బరువు 2230 కిలోలు. మూడేళ్ల పాటు నిర్మించిన ఈ ఎస్‌ఏఎస్‌కు రూ.235 కోట్లు ఖర్చు అయ్యింది. ఇది పూర్తిగా సమాచార ఉపగ్రహం. ఇందులో రేడియో సంకేతాలను అందుకొనే 12 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌ పాండర్లు ఉంటాయి. ప్రతి దేశం కనీసం ఒక ట్రాన్స్ పాండర్‌తో అనుసంధానం కావచ్చు. ఈ ఉపగ్రహం అందించే సేవలన్నింటినీ మన పొరుగుదేశాలు పొందవచ్చు. టీవీ, డీటీహెచ్, టెలి మెడిసిన్, టెలి ఎడ్యుకేషన్ వంటి కార్యక్రమాలకు ఇది ఉపయోగపడుతుంది. భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, వరదలు వంటి విపత్తులు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందించనుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy