నింగిలోకి దూసుకెళ్లిన ‘పీఎస్ఎల్వీ-26’

ఇస్రో మరో రికార్డ్ క్రియేట్ చేసింది. పీఎస్ఎల్వీ సీ-26ను ప్రయోగించి విజయం సాధించింది.  మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) సక్సెస్ చేసి నెల తిరగకుండానే మరో అంతరిక్ష ప్రయోగాన్ని సక్సెస్ చేసింది ఇస్రో. బుధవారం అర్ధరాత్రి 1.30 నిమిషాలకు ఈ రాకెట్ ను ప్రయోగించింది. పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో తిరుగులేని రికార్డును కొనసాగిస్తూ… సీ 26 రాకెట్ ను కూడా నింగిలోకి పంపగలిగింది ఇస్రో.  పీఎస్ఎల్వీ సీ 26 రాకెట్ ప్రయోగంతో… ఏడు శాటిలైట్ల సముదాయమైన ఇండియన్ రీజినల్ నేవిగేషన్ శాటిలైట్  సిస్టమ్ IRNSS -1C ని  కక్ష్య లోకి పంపింది ఇస్రో. భూమి, ఆకాశ, సముద్ర ప్రాంతాలపై నిఘా పెట్టేందుకు ఈ నేవిగేషన్ శాటిలైట్ సాయపడుతుంది. విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లోనూ పైలట్లకు ఈ శాటిలైట్ ఉపయోగపడనుంది. ఈ ప్రయోగాన్ని శ్రీహరికోటలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ పర్యవేక్షించారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy