నిజాం పై అక్బరుద్దీన్ అభిప్రాయం

akb

నిజాం పాలనపై అసెంబ్లీలో మంత్రి శైలజానాథ్ చేసిన వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విభజనకు కారకులైన వారిని వదిలేసి నిజాం నవాబులను నిందించడం తగదన్నారు. రాష్ట్ర విభజనకు నిజాం కారకుడా అని ప్రశ్నించారు. నిజాంలు సమర్థులైన పాలకులని కితాబిచ్చారు. 1962లో చైనాతో యుద్ధం సమయంలో నిజాం నవాబులు 120 కేజీల బంగారాన్ని భారత సైన్యానికి ఇచ్చారని గుర్తు చేశారు. పాత గాయాలజోలికి పోవద్దని, వాటిని రేపితే అన్ని ప్రాంతాల ప్రజలు గాయపడతారని అక్బరుద్దీన్‌ అన్నారు. మరోవైపు విభజనపై టీడీపీ అనుసరిస్తున్న విధానాలను అక్బరుద్దీన్ తప్పుబట్టారు. సమన్యాయం అంటే ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు ప్రాంతాలకూ ఎలాంటి న్యాయం జరగాలో ఎందుకు చెప్పరని ప్రశ్నించారు.

అంతకు ముందు మంత్రి శైలజా నాథ్ నిజాం ను కీర్తించడమంటే భారత రాజ్యాంగానికి ద్రోహం చేయడమేనన్నారు. నిజాం దుర్మార్గుడైన ప్రభువని కూడా అన్నారు శైలజానాథ్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy