- నిజామాబాద్ లో గుజరాతీలు, మరాఠీలతో పాటు భిన్నవర్గాలవాళ్లు ఉండటంతో మినీభారత్ అనిపిస్తుంది.
- నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 51 వేల 888.
- పురుష ఓటర్లు లక్షా 18 వేల 318.
- మహిళా ఓటర్లు లక్షా 21 వేల 570.
- ఇక్కడ మున్నూరు కాపు, పద్మశాలి కులస్తులు, మైనార్టీలు తీర్పును ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారు.
- 1952 నుంచి 14 సార్లు ఎన్నికలు జరిగాయి.
- 1952, 57లో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థి ఎండి దావూద్ హుస్సేన్ గెలిచారు.
- తర్వాత వరుసగా మూడుసార్లు ఇండిపెండెంట్లకు ఛాన్సిచ్చారు ఇక్కడి ఓటర్లు.
- 1962లో హరినారాయణ, 1967లో కెవి గంగాధర్, 1972లో డాక్టర్ చక్రధర్ రావు స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచారు.
- కాంగ్రెస్ దిగ్గజం డి.శ్రీనివాస్ ను 1989, 1999, 2004లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు.
- అంతేకాదు, 1983, 1994, 2009, 2010 ఎన్నికల్లో నాలుగుసార్లు డీఎస్ ను ఓడించారు.
- 1983లో, 1985లో డి. సత్యనారాయణ, 1994లో సతీష్ పవార్ టీడీపీ అభ్యర్థులుగా గెలిచారు.
- ఓవరాల్ గా ఐదుసార్లు కాంగ్రెస్, మూడుసార్లు టీడీపీ, రెండుసార్లు బీజేపీ, నాలుగుసార్లు ఇండిపెండెంట్లకు పట్టంగట్టారు నిజామాబాద్ అర్బన్ ఓటర్లు.
……………….
2009 సాధారణ, 2010 ఉప ఎన్నికల్లో అర్బన్ ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న డీఎస్ కు రెండుసార్లు ఓటమి రుచి చూపించారు ఓటర్లు. జనంలో అంతగా గుర్తింపులేని బీజేపీ అభ్యర్థి యెండెల లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోవడం సంచలనం. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ ఉద్యమ కేంద్రంగా నిలిచింది అర్బన్ సెగ్మెంట్. ఇందులో విద్యావంతులే అధికం. అందుకేనేమో, 2004 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవులు నిర్వహించిన డీఎస్ ను తిరస్కరించారు. పైగా మైనార్టీ ఓట్లకోసం ఆయన చేసిన వివాదస్పద వ్యాఖ్యాలు ఓటమికి కారణమయ్యాయి.
- 2009 సాధారణ ఎన్నికలైన ఏడాదిలోపే తెలంగాణ ఉద్యమం కోసం యెండెల లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేశారు.
- దాంతో బై ఎలక్షన్స్ వచ్చాయి.
- ఉప ఎన్నికల్లో విజయం కోసం డీఎస్ విశ్వప్రయత్నాలు చేశారు. డీఎస్ కు సీఎం సీటు ఖాయమని పార్టీ శ్రేణులు ప్రచారం చేసినా… తెలంగాణ కోసం పదవిని త్యాగం చేసిన యెండెల లక్ష్మీనారాయణకే ఓటేయడం ఇక్కడి ఓటర్ల తీర్పుకు నిదర్శనం.
- రాష్ట్రంలో రాజకీయ దిగ్గజంగా పేరొందిన డీఎస్ ను ఓడించి యెండల లక్ష్మీనారాయణ రెండుసార్లు గెలిచారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
- యెండల షాక్ తో డీఎస్ నిజామాబాద్ రూరల్ కు షిఫ్ట్ అయ్యారు.
- గత ఎన్నికల్లో యెండల ప్రధాన హామీల్లో ఒకటైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి చేయలేకపోయారు.
- వర్షాలతో ఇబ్బందిపడే లోతట్టు ప్రాంతాల ప్రజలు సమస్యలను తీర్చలేకపోయారు.
- లోతట్టు ప్రాంతాల్లో మురికి కాలువలు, రోడ్లు నిర్మాణం చేపట్టలేపోయారంటున్నారు స్థానికులు.
- నిజామాబాద్ అర్బన్ లో తెలంగాణ సెంటిమెంట్ బీజేపీకి కష్టంగా మారే అవకాశాలున్నాయి.
……………………….
- తెలంగాణ సెంటిమెంట్ తో పాటు ఈసారి ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు చాలానే ఉన్నాయి.
- గల్ఫ్ దేశాలకు వలసవెళ్లిన కుటుంబాలకు భరోసానిచ్చే అభ్యర్థి కోసం జనం ఎదురుచూస్తున్నారు.
- నిజాంసాగర్ ప్రాజెక్ట్ చివరి ఆయకట్టుకు సాగునీరు లేక రైతులు కష్టాలు పడుతున్నారు. రైతుల కష్టాలను తీర్చాల్సిన అవరాన్ని గుర్తుచేస్తున్నారు.
……………………….
- స్థానిక పరిస్థితులతో పాటు ఈసారి ప్రధాన పార్టీల అభ్యర్థులు మారిపోయారు.
- డీ శ్రీనివాస్ నిజామాబాద్ రూరల్ కు మారారు.
- దాంతో కాంగ్రెస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ బరిలోకి దిగుతున్నారు.
- ఏదేమైనా ఇచ్చిన క్రెడిట్ తో కాంగ్రెస్, తెచ్చిన క్రెడిట్ తో టీఆర్ఎస్ పోటీ పడబోతున్నాయి.
- బీజెపీ నుంచి డి.సూర్యనారాయణ గుప్తా, వైసీపీ నుంచి శ్రీధర్ రెడ్డి అనంత, ఎంఐఎం నుంచి మీర్ మజాజ్ అలీలు బరిలోకి దిగుతున్నారు.
- ఈ నిజామాబాద్ అర్బన్ పోటీలో యెండల లేకపోవడంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్యే ప్రధానంగా పోటీ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
టీఆర్ఎస్ నుంచి బిగాల గణేశ్ గుప్తా పోటీకి దిగుతున్నారు.
మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే యెండల ఈ సారి బీజెపీ నుంచి బరిలోకి దిగడం లేదు.