నిజామాబాద్ కు ఐటీ పార్క్: కేటీఆర్

ktr-nizamabadపార్లమెంట్ లో అద్భుతంగా మాట్లాడే ఎంపీలైదుగురిలో ఎంపీ కవిత ఒకరన్నారు మంత్రి కేటీఆర్. నిజామాబాద జిల్లా ఆర్మూర్ లో జరిగిన జనహిత ప్రగతి సభలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వాదోపవాదాలు.. అప్పటి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. తెలంగాణ వస్తే కరెంటు ఉండదన్నారు. నక్సలైట్ల రాజ్యం వస్తదని మరొకరంటరు. భూస్వాముల రాజ్యం వస్తుందని ఇంకొందరన్నారు. ఉద్యమంలో కేసీఆర్ ఎన్ని తిట్లు తిన్నాడో తనకు తెలుసన్నాడు మంత్రి కేటీఆర్.

పేద ప్రజల కడుపు నింపడానికి మనిషికి ఆరుకిలోల బియ్యం ఇస్తోంది కేసీఆర ప్రభుత్వం. రాష్ట్రంలో 40 లక్షల పించన్లు ఇస్తున్నాం. ఆసరా పథకంతో వితంతు, ఒంటరి మహిళలకు రూ. 1000 పించన్ అందిస్తున్నారు. పేద ప్రజలు, బిడ్డలు ప్రభుత్వ స్కూళ్లకు, హాస్టల్లకు సన్న బియ్యంతో కడుపునిండ అన్నం పెడుతున్నారు కేటీఆర్.

పేదింటి ఆడబిడ్డకు నేనున్నానంటూ.. కళ్యాణ లక్ష్మి పథకాన్ని మొదలుపెట్టిండు సీఎం కేసీఆర్. బిడ్డ కడుపులో ఉన్నా అమ్మ పనివెళ్లక తప్పదు. అది చూసి అమ్మఒడి పథకంతో ఆరు వేలు.. గర్భిణీ మహిళలకు, శిశువుల ఆలనా పాలనా కోసం కేసీఆర్ కిట్ లను అందిస్తోంది టీఆర్ ఎస్ ప్రభుత్వం అన్నారు.

36 లక్షల రైతులకు.. 17 వేల కోట్ల రుణమాఫీ అందించింది వ్యవయసాశాఖ. యూపీలో ఆదిత్యనాథ్ తెలంగాణ షీ టీమ్స్ ప్రోగ్రామ్స్ ని కాపీ కొట్టి యాంటీ రోమియో స్వాడ్ ను మొదలు పెట్టాడన్నారు. తాను పనిచేయక పోతే ఓట్లు అడగనని చెప్పిన నేత కేసీఆర్ అన్నారు. వానలు వాపసు రావాలని 23 శాతం ఉన్న అడవులను 33 శాతానికి తీసుకెళ్లే ప్రోగ్రాం తెచ్చాం.

ఉత్తమ ప్రభుత్వం కేసీఆర్ దా లేక  55 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ దా మీరే డిసైడ్ చేసుకోవాలని ప్రజలతో అన్నారు. ఇంట్లో దొంగతనం చేస్తావ్ రా అని తల్లి అడిగితే.. తల్లిని రోకలి బండతో బాదిండు. తల్లి సచ్చింది. వాళ్ల నాన్న వచ్చిండు. నాన్నను కూడా బాధిండు. పోలీసులు కోర్టుకు తీసుకెళితే.. అనాథని సార్ వదిలిపెట్టండని అంటే అంది ఎంతవరకు సమంజసం. కడుపుల గుద్దుతరు.. నోట్ల పెప్పర్ మెంట్ పెడుతుంటరు. కాంగ్రెస్ ను అడ్రస్ లేకుండా చేయాలి.  ఇన్నేళ్లు గుర్రానికి పాచి పల్లు తోమిండ్రా అని కాంగ్రెస్ ను విమర్శించిండు మంత్రి కేటీఆర్.

ప్రొఫెసర్ జయశంకర్ ఎట్టికైనా.. మట్టికైనా మనోడే ఉండాలన్నారు. రాష్ట్రంలో తెలంగాణ కోసం టీఆర్ ఎస్ పార్టీని ఆదరించాలన్నారు. నిజామాబాద్ మున్షిపల్ కార్పోరేషన్ కు రూ.  100 కోట్లు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు కలిపి మొత్తం 350 కోట్లు కేటాయిస్తామన్నారు. నిజామాబాద్ లో ఐటీ పార్క్ పెట్టేందుకు ఎన్ ఆర్ ఐలు వస్తే స్వాగతిస్తాం అన్నారు మంత్రి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy