నితీశ్‌కు షాక్ ఇచ్చిన లాలూ ప్రసాద్

Lalu-Yadav-Nitish-Kumarబిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌కు  షాక్ ఇచ్చాడు మిత్రపక్ష నేత లాలూప్రసాద్‌ యాదవ్‌. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తన తనయుడు తేజస్వీ యాదవ్‌ నాలుగు రోజుల్లోగా డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని నితీశ్‌ అల్టిమేటమిచ్చాడు. తేజస్వీ యాదవ్‌ తన పదవీకి రాజీనామా చేయడని, ఆయన ఏలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు లాలూప్రసాద్‌ యాదవ్‌.  ల్యాండ్‌ ఫర్‌ హోటల్‌ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ నాలుగురోజుల్లో రాజీనామా చేయాలని సీఎం నితీశ్‌కుమార్‌ అల్టిమేటం ఇచ్చిన సందర్భంగా తీవ్రంగా స్పందించారు లాలూ ప్రసాద్.

లాలూ, ఆయన కుటుంబసభ్యులు, అనుచరులపై సీబీఐ దాడులు జరుగుతున్న సందర్భంలో లాలూ తొలిసారి ‘ఇండియా టుడే’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. నితీశ్‌కుమార్‌ క్యాబినెట్‌ నుంచి డిప్యూటీ సీఎంగా తేజస్వి తప్పుకునే ప్రసక్తే ఉండదని తేల్చిచెప్పారు ఆయన. తనను, తన పార్టీ ఆర్జేడీని ఫినిష్‌ చేసేందుకే ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కుట్ర పన్నారని, అందులో భాగంగానే కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు తమపై దాడులు చేస్తున్నాయని ఆరోపించారు లాలూ. ‘ హోటల్‌ ఒప్పందం కుదిరినప్పుడు తేజస్వి మైనర్‌. క్రికెట్‌ ప్లేయర్‌గా ఉన్నాడు. అతనిపై ఆరోపణలు ఆధారరహితం’ అని లాలూ కొట్టిపారేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy