నిద్ర తక్కువైతే డేంజరేనట..!!

4కంటి నిండా నిద్ర పోతేనే ఫుల్ జోష్ అంటున్న సైంటిస్టులు

లేటెస్ట్ గా నిద్ర పై అమెరికాలో పరిశోధనలు

నిద్రలేనితనంతో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు

నిద్ర కరువైతే… ఆ రోజంతా మగత మగతగానే

సౌండ్ స్లీప్ తో  బోలెడన్ని లాభాలు

కంటి నిండుగా నిద్ర కరువైతే డేంజరే అంటున్నారు సైంటిస్టులు.  డైలీ లైఫ్ లో ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడం లో అట్టర్ ఫ్లాప్ అవడం ఖాయమంటున్నారు. నిద్ర ను ఏమాత్రం లైట్ గా తీసుకున్నా రిజల్ట్  హెవీగా ఉంటుందని  తెగేసి చెబుతున్నారు సైంటిస్టులు. శరీరానికి సరిపడ నిద్ర లేకపోతే కలిగే అనర్థాలపై లేటెస్ట్ గా అమెరికన్ సైంటిస్టులు పరిశోధనలు  చేశారు. ఈ పరిశోధనల్లో బాంబుల్లాంటి  విషయాలు బయటపడ్డాయి. చరిత్రలో జరిగిన అనేక మేజర్ ఇన్సిడెంట్ల వెనక ఈ స్లీపింగ్ డిస్ ఆర్డర్స్ ఉన్నట్లు తేల్చి చెప్పారు సైంటిస్టులు.

నిద్ర పై ఉన్నన్ని మిస్ అండర్ స్టాండింగ్స్ మరో ఇష్యూపై  లేవు. ఎంత తక్కువ నిద్ర పోతే అంత మొనగాడన్న ఒక తప్పుడు కాన్సెప్ట్ సొసైటీలో బిల్డప్ అయింది. ఆరోగ్యానికి నిద్ర ఎంత అవసరమో  తెలియకపోవడం వల్ల కలుగుతున్న అనర్ధమే ఇది. మెజారిటీ జనానికి అయిదారు గంటల నిద్ర  సరిపోతుంది.  మరి కొంతమంది,  జస్ట్ నాలుగు గంటలతోనే సరిపెట్టుకుంటారు. ఎన్ని గంటల నిద్ర అవసరం అనేది వాళ్ల వాళ్ల బాడీ ని బట్టి ఉంటుంది.  ముందుగా మనకు ఎన్ని గంటల నిద్ర అవసరమో తెలుసుకోవాలి. అన్ని గంటలు తప్పనిసరిగా నిద్ర పోవాలి. ఒక్కోసారి అయిదారు గంటలు కంటిన్యూగా కునుకు తీయడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు ఇన్ స్టాల్ మెంట్స్ లో నైనా బ్యాలెన్స్ లాగించేయాలి.  లేదంటే, ఆ రోజంతా మగత మగత గా ఉంటుంది. ఏ పని చేయలేం. అసలు మనిషిలోనే జోష్ ఉండదు.

రాత్రి  నిద్ర చాలక పగలు నిద్రపోయేవాళ్లంటే  చాలా మందికి  చిన్నచూపు.  సొసైటీలో సీన్ మారింది.  సిటీస్ లో   ఇప్పుడు  షిఫ్ట్  సిస్టమ్  ఉద్యోగాలు  ఎక్కువయ్యాయి.  ఈ కొలువుల్లో రాత్రంతా  డ్యూటీ చేయాల్సి  వస్తుంది.  దీంతో,  పగలు వీలు చూసుకుని ఒకట్రెండు గంటలు కునుకు తీయాల్సిన  పరిస్థితులు వచ్చాయి.  ఒకేసారి  అయిదారు గంటలు నిద్ర పోవడం కుదరక పోయినా,  విడతలవారీగా నైనా  అన్ని గంటల నిద్ర ను పూర్తి చేయాల్సిందే అంటున్నారు సైంటిస్టులు. నిద్ర అంటే అరగంటకో, గంటకో  మెలకువ వచ్చే కోడి నిద్ర కాదు. పక్కన బాంబులు పడ్డా మెలకువ రానంత సౌండ్ స్లీప్. కంటి నిండుగా నిద్ర పోయే వాళ్లలో జ్ఞాపక శక్తితో పాటు లెర్నింగ్ స్కిల్స్  పెరుగుతాయని  తేల్చి  చెప్పాయి అనేక పరిశోధనలు. సౌండ్ స్లీప్ తో బ్రెయిన్  సెల్స్ కు తగినంత రెస్ట్  దొరుకుతుంది. దీంతో, కొత్త విషయాలు నేర్చుకోవడం కొత్త కొత్త ఇష్యూస్ మైండ్ లో రిజస్టర్ కావడం ఈజీ అవుతుంది. కంటినిండుగా నిద్రపోతే తెల్లారేసరికి ఫుల్ జోష్ కు కేరాఫ్ అడ్రస్ మీరే అవుతారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy